జాకీ గురించి ప్ర‌శ్నిస్తే ఫీలైన ర‌కుల్..కార‌ణాలు అవేనా?

Update: 2022-04-15 16:30 GMT
ర‌కుల్ ప్రీత్ సింగ్-జాకీ భ‌గ్నానీ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నాళ్లుగా ఇద్ద‌రు సీరియ‌స్  రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఇద్ద‌రికి దొడ్డి దారిన తిర‌గాల్సిన ప‌నిలేదు. ఏ ప‌ని చేసినా అధికారికంగా చేయోచ్చు. రూమ‌ర్లు స్ర్పెడ్ అవ్వ‌డానికి ఎంత మాత్రం స్కోప్ లేదు.  ప‌బ్లిక్ గా విదేశీ టూర్లు వేయోచ్చు . మాల్దీవులు ట్రిప్పులు ముగించొచ్చు. ఇప్ప‌టికే ఆ ప‌నులు కూడా పూర్తి చేసేసారు.

ఇలా ఇద్ద‌రి ప్రేమాయ‌ణాన్ని జంట ప‌బ్లిక్ చేయ‌డంతో మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి ర‌కుల్ ని అంతే ఓపెన్ గా ప్రియుడి గురించి అడిగేయ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే ప్ర‌తీ సారి ప్రియుడి టాపిక్ తీసుకురావ‌డంతో ఈసారి చెప్ప‌ను భ‌య్యా అంటూ కాస్త మూతి బిగించిన స‌న్నివేశం చూపించింది. ఇదంతా ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో రొటీన్. అమ్మ‌..నాన్న‌..త‌మ్మ‌డు అలాగే జీవితంలో పార్ట‌న‌ర్ కూడా అంతే అనేసింది.

అత‌ని గురించి ప్ర‌త్యేకంగా  మాట్లాడేది ఏముంటుంది? ఆ విష‌యం గురించి ప్ర‌తీసారి అడ‌గొద్దు . ఏదైనా ఉంటే ముందుగా మీకే చెబుతాను. ప్ర‌తీ సంద‌ర‌భంలోనూ  బోయ్ ప్రెండ్ భ‌జ‌న వ‌ద్దు అంటూ క‌సుబుసు మంది. ఇంత‌వ‌ర‌కూ ప్రియుడి గురించి ఎక్డ‌కా ఇలా మాట్లాడ‌లేదు. ప్ర‌తీసారి ఎంతో ఓపిక‌గానే స‌మాధానం ఇచ్చింది.

కానీ ఈసారి ఎందుక‌నో ప్రియుడి పేరు ఎత్తితేనే ఆ వ్య‌వ‌హారం ఇప్పుడు ఎందుకు అన్న తీరున మాట్లాడటం కొంద‌ర్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లో ఏదైనా తేడాలు మొద‌ల‌య్యాయా?  లేక బోయ్ ప్రెండ్ గురించి ప్ర‌తీసారి ప్ర‌శ్నిస్తున్నారని  విసుగు చెంది చిరాకు ప‌డిందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. `డాక్ట‌ర్ జీ` అనే  సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.  అలాగే `ఛ‌త్ర‌వాలీ` అనే మ‌రో సినిమాలో  కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. `ఎటాక్`..`ర‌న్ వే`..`థాంక్ గాడ్`..`మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది.  తెలుగులో `31 అక్టోబ‌ర్  లేడీస నైట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.  టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని  ఆమ‌ధ్య‌ బ‌హిరంగానే కోరిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News