సినిమాల్లో హీరోయిన్ కేరక్టర్ ఉండే ప్రాధాన్యత ఎంత ? ఏంటీ క్రిటికల్ క్వశ్చన్స్ అడిగి కన్ ఫ్యూజ్ చేస్తారేంటి అనుకుంటున్నారా.. కేరక్టర్ సంగతేమో కానీ.. కలెక్షన్లలో మాత్రం వీళ్ల పోటీ గట్టిగానే ఉంటోంది. కోట్లు పిండుకోవడంలో గట్టిగానే పట్టుబడుతున్నారు హీరోయిన్లు. తమకు రావాల్సిన మొత్తమో, అంతకంటే ఓ పిసరంత ఎక్కువో ఇస్తే.. హీరో ఎవరు అని పట్టించుకునే ప్రసక్తే ఉండడంలేదు. ఒకరిద్దరు హీరోయిన్ లు దీనికి కాస్త భిన్నంగా ఉంటారులెండి. అయినా సరే... మెజారిటీ భామల లెక్క... తమ బ్యాంక్ లెక్కలు చూసుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు.
కోట్లు కుమ్మరిస్తే.. కొత్త - పాత అనే తేడా లేకుండా అందాలు ఒలకబోస్తున్నారు. తమ ట్యాలెంట్ ని ప్రదర్శిస్తున్నారు. సినిమా సక్సెస్ - ఫెయిల్యూర్ లను పక్కన పెట్టేసి... రెమ్యూనరేషన్ వరకే పరిశీలిస్తే... నయనతార టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ భామతో మూవీ చేయాలంటే అక్షరాలా రెండు కోట్ల 25లక్షలు చదివించుకోవాల్సిందే. ఆ తర్వాత ప్లేస్ స్వీటీ అనుష్కది. కనీసం రెండు కోట్లన్నా ఇవ్వనిదే సినిమాకి ససేమిరా అనేస్తుంది అనుష్క. వీళిద్దరి తర్వాత అత్యధిక పారితోషకం సమంత - శృతిహాసన్ లదే. కోటిన్నర వరకూ ముట్టచెబితేనే డేట్స్ కేటాయిస్తారు వీళ్లిద్దరూ. మరో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి కోటి నుంచి కోటీ పాతికలక్షలవరకూ చదివించుకోవాలి. మిల్కీబ్యూటీ తమన్నా ఈ రేంజ్ లోనే ఉంది.
ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ దగ్గరికొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... కోటి మార్క్ కి మాత్రం ఇప్పటికే వచ్చేసింది. రాశీ ఖన్నాకి 50నుంచి 75 లక్షలు, మెగా హీరోయిన్ అయేందుకు తాపత్రయపడుతున్న రెజీనా 50 లక్షలు వసూలు చేసుకుంటున్నారు. త్రిష - హన్సిక - శ్రియ - అంజలిలు కూడా స్థాయిలోనే ఊగుతున్నారు. పొట్టిపిల్ల అయినా గట్టిదానిగా పేరున్న నిత్యామీనన్ కి 60వరకూ ముట్టచెప్పాలి. ఇక కలర్స్ స్వాతి 45 లక్షలు - లావణ్య త్రిపాఠి 35 లక్షలు - తాప్సీ 30 లక్షలు తీసుకుంటున్నారు. ఇలియానాకి కోటి కంటే ఎక్కువే ఇస్తామని ప్రొడ్యూసర్స్ చెబుతున్నా... ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోవడం లేదు. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకే అని టాక్. ఇదీ వయ్యారి భాయల వసూళ్ల లెక్కలు.