తెలుగు హీరోలకు అంత దమ్ము లేదా?

Update: 2022-06-21 02:30 GMT
ఇటీవల తమిళంలో వచ్చిన "వీట్ల విశేషం" బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా పాజిటివ్ రిజల్ట్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీకెండ్ లో ఒక్కసారిగా సినిమాకు ఆడియెన్స్ క్యూ కట్టడంతో సౌత్ లో అందరి ఫోకస్ కూడా ఈ సినిమాపైనే పడింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ RJ బాలాజీ రచన, దర్శకత్వం చేయడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించాడు. అందరూ భయపడుతున్న ఈ సినిమాను అతని ధైర్యంగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

వీట్ల విశేషమ్ అనేది బాలీవుడ్ హిట్ ఫిల్మ్ “బదాయి హో”కి రీమేక్ గా తెరకెక్కింది. బోణి కపూర్ రాహుల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న కథానాయకుడి కథతో కొనసాగుతుంది.

కానీ అకస్మాత్తుగా అతని తల్లి గర్భవతి అవుతుంది. ఫలితంగా సమాజంపై తప్పులు సెటైరికల్ కామెడీ ఉంటుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా అర్థవంతంగా ఉండడంతో ఓ వర్గం ఆడియెన్స్ కు సినిమా బాగానే కనెక్ట్ అయ్యింది.

నిజానికి ఈ సినిమాని ముందుగా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బాధాయు హో రీమేక్ హక్కులను కూడా తీసుకున్నాడు. నాగచైతన్యతో చేయాలని కూడా కొన్నాళ్ళు చర్చలు జరిగాయి. కానీ నాగ చైతన్య చేయడానికి నిరాకరించాడు.  

ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు కానీ అది కూడా కుదరలేదు. ఇక ఫైనల్ గా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఎవరు ధైర్యం చేయకపోవడంతో సురేష్ బాబు హక్కులను వదులుకోవాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమాని మన యంగ్ హీరోలు టేకప్ చేయడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారా అని నిర్మాతలు ఆశ్చతుఅపోతున్నారు. సినిమా కథ తల్లి పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబట్టి మన తెలుగు ఆడియెన్స్ అంతగా ఆదరించకపోవచ్చని భయం కూడా ఉందట. ఇక ఈ సినిమా తమిళ వెర్షన్ వర్క్ అవుట్ అవడంతో రైట్స్ సొంతం చేసుకున్న బోనీ కపూర్ ఈ సినిమా తీసేందుకు సరైన హీరోని చూసుకోమని ఇటీవల టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుని కోరినట్లు సమాచారం.
Tags:    

Similar News