అందరూ వెళ్లిపోయారు.. ఆ ఎరాకు తెర

Update: 2022-11-15 15:30 GMT
ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ స్టార్లు ఎవరంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌ల పేర్లు చెబుతాం. ముందు తరం విషయానికి వస్తే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల చుట్టూనే ఇండస్ట్రీ తిరిగింది. ఈ తరహాలో అంతకుముందు తరంలో టాప్ స్టార్లు ఎవరంటే ఐదుగురు హీరోల పేర్లు వినిపించేవి.

వాళ్లే.. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు. వీరిలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినిమా తొలి తరం సూపర్ స్టార్లుగా చెప్పొచ్చు. వీరి అప్రతిహత ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో వచ్చి వారికి దీటైన సూపర్ స్టార్‌గా ఎదిగిన హీరో కృష్ణ.

ఆయనతో పాటు కృష్ణంరాజు, శోభన్ బాబు పెద్ద స్టార్లుగా అవతరించారు. ఈ ఐదుగురూ కలిసి చాలా ఏళ్లు ఇండస్ట్రీని ఏలారు. ఆ తర్వాత చిరంజీవి హవా మొదలైంది. ఆయనతో పాటు ఇంకో ముగ్గురు పెద్ద స్టార్లుగా అవతరించారు.

ముందుతరం ఐదుగురు దిగ్గజ నటుట్లో ముందుగా అందరిలోకి సీనియర్ అయిన ఎన్టీఆర్ 1996లో అనూహ్య పరిస్థితుల మధ్య చనిపోయారు. ఆ తర్వాత శోభన్ బాబు  2008లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇక ఏఎన్నార్ క్యాన్సర్‌తో పోరాడి 2014లో పరమపదించారు. ఇక కృష్ణంరాజు రెండు నెలల కిందటే అనారోగ్య కారణాలతో చనిపోవడం తెలిసిందే.

ఇప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండానే సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూశారు. ఇలా ఇండస్ట్రీకి ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించారు. దీంతో తెలుగు సినిమా గోల్డెనా ఎరాలోని సూపర్ స్టార్లందరూ టాలీవుడ్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు అయింది. తెలుగు సినిమా ఖ్యాతిని దిగంతాలకు చేర్చిన అయిదుగురు దిగ్గజ నటులూ కన్నుమూయడం అప్పటి సినిమాలను అనుసరిస్తూ వచ్చిన అభిమానులకు తీరని వేదన కలిగించేదే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News