165 రిలీజైతే 4 హిట్లే ద‌క్కాయ్‌

Update: 2015-12-20 17:30 GMT
ఇది నిజంగానే టూమ‌చ్‌. టాలీవుడ్‌ లో ఈ ఏడాది 165 సినిమాలు రిలీజైతే, ఇందులో హానెస్ట్‌ గా రిలీజైన‌వి కేవ‌లం నాలుగు సినిమాలు మాత్ర‌మే. బాహుబ‌లి - శ్రీ‌మంతుడు జెన్యూన్ బ్లాక్‌ బ‌స్ట‌ర్స్‌. బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి నిర్మాత‌ల‌కు - బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇక శ్రీ‌మంతుడు 200 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి టాలీవుడ్‌ లో టాప్ -2 సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. సోష‌ల్ మూవీస్‌ లోనే నంబ‌ర్‌- 1 మూవీగా శ్రీ‌మంతుడు రికార్డుల‌కెక్కింది.

ఇక పోతే అంతే జెన్యూన్‌ గా నిర్మాత‌కు - బ‌య్య‌ర్లు - పంపిణీదారుల‌కు లాభాలు తెచ్చిన సినిమాలు ఇంకో  రెండు మాత్ర‌మే ఉన్నాయ్‌. నాని హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ - ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజుగారి గ‌ది సినిమాలు బంప‌ర్ హిట్ కొట్టాయి. బ‌య్యరు - పంపిణీదారును ఖుషీ చేసిన సినిమాలివి. ఈ హిట్టుతో వారాహి చ‌ల‌న‌చిత్రం మ‌రోసారి హ‌వా చాటింది.  ఇక పోతే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి - గోపాల గోపాల‌ - రుద్ర‌మ‌దేవి - సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌ - కంచె సినిమాలు హిట్ట‌య్యాయి అన్న ప్ర‌చారం త‌ప్ప బ‌య్య‌ర్లు సేఫ్ అయ్యిందే లేద‌ని చెబుతున్నారు.

ఇక సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ భారీగా లాభాలు తెచ్చింద‌ని చెబుతున్నా అధికారికంగా లెక్క‌లు తేలాల్సి ఉందింకా. వంద పైగా సినిమాల్లో నాలుగు జెన్యూన్ హిట్స్ అంటే టాలీవుడ్ ఏ లెవ‌ల్‌ లో ఉందో అర్థం చేసుకోవాల్సిందే మ‌రి.
Tags:    

Similar News