కాలానుగుణంగా సమయాన్ని బట్టి ఓడలు బల్లవుతుంటాయి.. బల్లు ఓడలవుతుంటాయంటారు. అథికారం చెలాయించిన వాళ్లు ఆ తరువాత కాలంలో అధికారాన్ని కోల్పోవడం..గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనడం చూస్తూనే వున్నాం. ఇక ఓ మాట అని ఆ తరువాత అదే మాట వల్ల ఇరుకున పడ్డవాళ్లని చూశాం. ఇప్పడు ఇదే తరహా పరిస్థితిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎదుర్కోబోతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా, నైజాం, ఉత్తరాంధ్రి డిస్ట్రిబ్యూటర్ గా ఓ వెలుగు వెలుగుతూ తనదైన మార్కు సినిమాలతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఆయన జడ్జిమెంట్ కి తిరుగులేకపోవడంతో నిర్మాతగా, నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ డిస్ట్రిబ్యూటర్ గా గత కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్లకు ఆయన ఏం చెబితే అది.. ఎంత చెబితే అంత అన్నట్టుగా మారింది.
అయితే సంక్రాంతి సీజన్ ఒక్కసారిగా దిల్ రాజు కు వ్యతిరేకంగా, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లకు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా దిల్ రాజు డామినేషన్ ని బరిస్తున్న కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుకు ఇప్పడు మంచి టైమ్ దొరికినట్టుగా తెలుస్తోంది. కారణంగా దిల్ రాజు వచ్చే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఇప్పటికే కొన్ని ధియేటర్ల వారితో అగ్రిమెంట్ లు కూడా చేయించుకున్నాడట.
మరి కొంత మందితో అగ్రిమెంట్లకు రెడీ అవుతున్నారట. ఇది కరెక్ట్ కాదని భావించిన కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజుకు సహకరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి బాలయ్య `వీర సింహారెడ్డి లేదా చిరంజీవి `వాల్తేరు వీరయ్య` తప్పుకుంటాడని భావించి దిల్ రాజు `వారసుడు` మూవీకి సై అన్నారట. అయితే ఇప్పడు బాలయ్య `వీర సింహారెడ్డి లేదా చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ఇప్పడు తెలుగు సినిమాకే తొలి ప్రధాన్యత అంటూ దిల్ రాజు కు అడ్డం తిరుగబోతున్నారట.
ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం `వారసుడు` రిలీజ్ ని దిల్ రాజు వాయిదా వేయకపోయినా డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి కారణంగా బాలయ్య `వీర సింహారెడ్డి లేదా చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాలకు ప్రధాన థియేటర్లని వదిలే అవకాశం వుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల దెబ్బకు దిల్ రాజు దిగొస్తాడా?.. అనుకున్నట్టుగానే బాలయ్య `వీర సింహారెడ్డి లేదా చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాలకు థియేటర్లని వదిలేస్తాడా? అన్నది తెలియాలంటే మరో వారం వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.