డజన్ సినిమాల్లో వీళ్లే వదలడం లేదు..

Update: 2016-03-31 17:30 GMT
ఏప్రిల్ 1న అనేక చిన్న సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కనుక మిస్ అయితే.. మరో నెలన్నరవరకూ డేట్ సెట్ చేసుకోవడం చాలా కష్టం కావడంతో లో బడ్జెట్ సినిమాల్లో చాలావరకూ ఏప్రిల్ 1ని టార్గెట్ చేసేశాయి. 14 సినిమాలు ఒకేరోజున థియేటర్లలోకి వస్తున్నాయంటే పరిస్థితి అర్ధమవుతుంది. డజను సినిమాలకు పైగా కౌంట్ ఉన్నా.. ఇందులో చెప్పుకోదగ్గ వాటి సంఖ్య తక్కువే అనాలి. స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోయినా.. నారా రోహిత్ సినిమా సావిత్రిపై అంచనాలు ఉన్నాయి. ఇది కాకుండా మంచు మనోజ్-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ కూడా ఎటాక్ చేస్తోంది.

ఈ రెండూ కాకుండా మిగిలిన డజన్ సినిమాల్లో 'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్ర యూనిట్ పై ప్రచారంపై బాగా దృష్టి పెట్టింది. తమిళ డబ్బింగ్ సినిమానే అయినా.. స్ట్రైట్ మూవీకి ధీటుగా పబ్లిసిటీ చేసేస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ వామికా గబ్బి కూడా ప్రచారంలో పాల్గొంది. ఈ పిల్లకు టాలీవుడ్ కొత్తేం కాదు. మూడు నెలల క్రితం సుదీర బాబ్ సినిమా భలే మంచి రోజులో కూడా సందడి చేసింది. మూడు నెలల తేడాలో రెండో సినిమా రిలీజ్ కావడం వామికా గబ్బిలో ఉత్సాహం కనిపిస్తోంది.

7/జీ బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీరాఘవ అందించిన స్టోరీపై.. ఆయన భార్య గీతాంజలి తీసిన సినిమా ఇది. అయినా సరే.. మొత్తం ప్రచారం అంతా శ్రీరాఘవ పేరుపైనే సాగుతోంది. కోలా బాలకృష్ణ, వామిక గబ్బి జంటగా వస్తున్న 'నన్ను వదిలి నీవు పోలేవులే' .. ఏమేరకు ప్రేక్షకులను అలరించనుందో.?
Tags:    

Similar News