టాలీవుడ్ స్టార్ క‌పుల్స్ వెకేష‌న్స్ అంటే అట్లుంట‌ది మ‌రి!

Update: 2022-05-08 00:30 GMT
వెకేష‌న్ల పేరుతో విదేశీ అందాల్ని ఆస్వాదించే టాలీవుడ్ సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. స‌మ‌యం దొరికితే వెకేష‌న్ ప్లైట్ ఎక్కిపోవాల‌ని చాలామంది   వెయిట్ చేస్తుంటారు. కానీ అంది అంద‌రూ చేయ‌లేరు. టాలీవుడ్ లో కొంత మంది స్టార్  క‌పుల్స్ కే అది సాధ్యం. మ‌ధ్య‌లో ప్లానింగ్ ఛేంజ్ అవ్వ‌డం స‌హా ఇత‌ర కార‌ణాలుగా వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం ఉన్న‌ట్లుండి ర‌ద్ద‌వుతుంది.

కానీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ... మెగా ప‌వ‌ర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం మాత్రం వెకేష‌న్ ఛాన్స్ దొరికితే ఏమాత్రం మిస్ చేసుకోరు. భార్యా పిల్ల‌ల‌తో  విదేశాలు చెక్కేయాల‌ని ఎంతో ఉత్సాహం చూప‌స్తుంటారు. మ‌హేష్ ఫ్యామిలీ ఏడాదిలోల క‌నీసం  మూడు సార్లు  విదేశాల‌కి వెకేష‌న్ కి వెళ్తుంటారు.

ముఖ్యంగా సినిమా షూటింగ్ పూర్త‌యిందంటే క‌చ్చితంగా ఫ్యామిలీతో ప్లైట్  ఎక్కేయాల్సిందే. ఒక‌వేళ మ‌హేష్ లేని ప‌క్షంలో న‌మ్ర‌త పిల్ల‌ల‌తో జాలీ  ట్రిప్ వేయాల్సిందే. టాలీవుడ్ క‌పుల్స్ లో ఎక్కువ‌గా వెకేష‌న్లకు  వెళ్ల జంట ఇదే. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ దంపతులు ఈ రేసులోఉన్నారు. పెళ్లైన కొత్త‌లో కొన్నాళ్ల పాటు ఎలాంటి వెకేష‌న్లు ప్లాన్ చేయ‌ని దంప‌తులు అటుపై చిలౌట్ అవ్వడం కోసం విదేశాలు మాత్ర‌మే బెస్ట్ ఛాయిస్ అని  వీలున్న‌ప్పుడల్లా ప్లైట్ ఎక్కేస్తుంటారు.

ఇక బ‌న్నీ దంప‌తులు  వెకేష‌న్ అంటే విదేశాల‌కే వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇండియాలోనే  ఎన్నో సుంద‌ర‌మైన ప్ర‌దేశాలున్నాయి. అక్క‌డికైనా వెళ్లొచ్చు అన్న టైపు. ఖాళీ స‌మయం దొరికితే స‌తీస‌మేతంగా ఏదో ఒక ప్లైట్ ఎక్కేస్తారు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ -ప్ర‌ణ‌తి కూడా ప్ర‌వ‌సీని కోరుకుంటారు అప్పుడ‌ప్పుడు. కుమారుడుల ఆయ‌న్ పుట్టిన త‌ర్వాత వెకేష‌న్ల పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపిస్తున్నారు.

ఇక అక్కినేని నాగార్జున‌-అమ‌ల సైతం రేర్ గా వెకేష‌న్లు ప్లాన్ చేస్తుంటారు. రెండు రోజుల ముందుగా భార్య భార్త‌లు స్పాట్ కి చేరుకేంటే అటుపై కుమారులు నాగ చైత‌న్య‌..అఖిల్ మామ్-డాడ్ తో అసోసియేట్ అవుతుంటారు. ఇక మెగా దంప‌తులు చిరంజీవి-సురేఖ కూడా అప్పుడ‌ప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం విదేశాలు వెళ్తుంటారు.

ఇటీవ‌లే `ఆచార్య` రిలీజ్  అయిన త‌ర్వాత ఈ దంప‌తులు అమెరికా ప్లైట్ ఎక్కేసారు. మంచు మోహ‌న్ బాబు దంత‌తులు అరుదుగా వెకేష‌న్లు వెళ్తుంటారు. ఇక `ఏక్ నిర‌`జన్` ప్ర‌భాస్ కూడా అప్పుడ‌ప్పుడే ఒక్క‌డే ఏదో దేశం వెళ్లిపోతుంటారు. అక్క‌డ‌ ఏకంగా కొన్ని వారాల పాటు తిష్ట వేసి వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తాడు. ఇంకా యంగ్ హీరోలు నిఖిల్..నితిన్ లాంటి వారు భార్యామ‌ణుల‌తో అప్పుడ‌ప్పుడు వెకేష‌న్ల‌కి వెళ్తుంటారు.
Tags:    

Similar News