భార్యమ‌ణుల మాటే వేదం అంటున్న స్టార్స్

Update: 2021-03-14 10:55 GMT
``యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా`` - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అనేది ఈ వ్యాక్యం అర్థం. స‌తీమ‌ణుల వైపు నుంచి మ‌న టాలీవుడ్ స్టార్లంద‌రికీ కావాల్సినంత స‌పోర్ట్ ఉంది. వారి సినిమాల్ని ప్ర‌మోట్ చేయ‌డంలో స‌తీమ‌ణులు సోష‌ల్ మీడియాల్లో ఎంతో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇక‌పోతే ఇప్పుడు త‌మ భార్య‌లు స్నేహితుల సినిమాల‌కు ప్ర‌చారం చేసి పెడుతుంటే.. ఔరా! అని అవాక్క‌వుతున్నారు. నిజానికి జాతిర‌త్నాలు సినిమాకి మ‌న టాప్ స్టార్స్ భార్యామ‌ణులు చేస్తున్న ప్ర‌చారం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

జాతిర‌త్నాలు సినిమా బాగుంద‌ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ట్వీట్లు చేయ‌డం వెనుకున్న అస‌లు రీజ‌న్ భార్య‌లేన‌ని తెలిసింది. బ‌న్నీ భార్య స్నేహా .. మ‌హేశ్ స‌తీమ‌ణి న‌మ్ర‌త ప్ర‌ధాన కార‌ణం. అయితే వీర‌ద్ద‌రు `జాతిర‌త్నాలు` పొడ్యూస‌ర్స్ స్నేహితులు కావ‌డం కొస‌మెరుపు అన్న అస‌లు సంగ‌తి లీకైంది మ‌రి!
Tags:    

Similar News