తెలుగు సినిమా ఇపుడు హద్దులు దాటేసింది. భాషా భేదాలను సులువుగా అధిగమించేసింది. తెలుగు సినిమా ఎల్లలు చెరిపేసింది. తెలుగు సినిమా బాలీవుడ్ కే సవాల్ చేస్తోంది. నిజానికి టాలీవుడ్ సౌత్ లో అతి పెద్ద సినీ పరిశ్రమ. ఏడాదికి వందకు పైగా సినిమాలు ఇక్కడ నిర్మాణం అవుతాయి. పాన్ ఇండియా మూవీ అన్న మాట వినని రోజులలో కూడా టాలీవుడ్ కి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇపుడు అది కాస్తా మరింతగా విస్తరించింది. బాలీవుడ్ కి ధీటుగా అని ఒకపుడు మాట వినిపించేది. ఇపుడు అది కాస్తా అర్ధాలు మార్చి బాలీవుడ్ ని దాటుకుంటూ అని కూడా చెప్పాల్సి వస్తోంది. టాలీవుడ్ ఇపుడు భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
నిన్నటిదాకా హిందీ సినీ సీమను శాసించిన వారు కూడా టాలీవుడ్ లో ఏం జరుగుతోంది అని చూస్తున్నారు. టాలీవుడ్ లో కొత్తదనం ఏంటి, అక్కడ నిర్మాణం ఎలా సాగుతోంది. అక్కడ స్టార్ల టార్గెట్లు ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. అంతే కాదు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ల రీమేక్స్ కి కూడా ఇపుడు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ లో వరసబెట్టి పాన్ ఇండియా మూవీస్ రెడీ అవుతున్నాయి. బాహుబలి వన్ టూ సినిమాల తరువాత కచ్చితంగా బాలీవుడ్ ఇటు వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇపుడు కూడా ట్రిపుల్ ఆర్ మూవీ బాలీవుడ్ లో అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఓటమి ఎరుగని రాజమౌళి దర్శకత్వం, భారతీయ చిత్ర పరిశ్రమ బాహుబలి గా ఎదిగిన జక్కన్న నిర్దేశకత్వం అంటేనే బాలీవుడ్ కలెక్షన్లు షేక్ అవుతాయన్నది కూడా అందరూ అంగీకరిస్తున్న సత్యం. దీనికి తోడు ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లాంటి మేటి స్టార్లు ఉన్నారు. ఇండియన్ సినిమాకు చెందిన ప్రముఖ తారాగణం అంతా కూడా ఉన్నారు. దాంతో ట్రిపుల్ ఆర్ ఎపుడు రిలీజ్ అయినా హిట్ అన్న టాక్ అయితే ఉంది. దీంతో పాటు బాహుబలి ఫేమ్ తోనే సాహో అంటూ బాలీవుడ్ లో అదరగొట్టిన ప్రభాస్ ఇపుడు రాధేశ్యామ్ తో మరోమారు అక్కడ తన సత్తా చాటనున్నారు. దాంతో పాటు ప్రభాస్ ఆది పురుష్, సలార్ వంటి పాన్ ఇండియా మూవీస్ లైన్ లో ఉన్నాయి.
ఇక మరో వైపు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు తయారవుతున్నా అల్లు అర్జున్ పుష్ప మూవీ ఫస్ట్ టైమ్ ఆయన్ని పాన్ ఇండియా హీరోగా చేస్తోంది. పుష్ప దూకుడు కూడా మామూలుగా లేదు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ మీద అతి పెద్ద అంచనాలే ఉన్నాయి. దాంతో బాలీవుడ్ లో మోస్ట్ అవైంటింగ్ మూవీగా పుష్ప ఉంది అనడంలో సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ తో డేరింగ్ అండ్ డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తీస్తున్న లైగర్ మూవీ కూడా పాన్ ఇండియా కోసం టార్గెట్ చేసినదే. ఈ మూవీ మీద కూడా అదిరిపోయే అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ సినిమాలు అన్నీ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేవిగానే లెక్క కడుతున్నారు. హిందీలో వచ్చే ఏడాది అనేక సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయితే 2022 ఫిబ్రవరి నాటికి చూసుకుంటే తెలుగు నుంచి వెళ్తున్న ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ మీదనే అందరి దృష్టి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్ ఎపుడు వచ్చినా కూడా టోటల్ గా భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త సంచలనాలు నమోదు చేయడానికి రెడీగా ఉంది అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ వైపు చూడు అంటోంది బీ టౌన్.