విజయ్ 'మాస్టర్'కి థియేటర్లు దొరికేదేలా..

Update: 2020-03-24 07:10 GMT
ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మాస్టర్'.  ఈ సినిమా ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది. విజయ్ సేతుపతి ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ కరోనా ప్రభావం వలన దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడిన సినిమాలన్నీ ఒకేసారి తెరమీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే విజయ్ 'మాస్టర్' సినిమా తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

తెలుగులో కరోనా వలన వాయిదా పడ్డ సినిమాలన్నీ ఏప్రిల్ లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాలు కేవలం తెలుగులోనే 10 పైనే ఉన్నాయి. మరి వాటికీ థియేటర్లు దొరకడమే కష్టమని కంగారు పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ సమయంలో విజయ్ నుండి మాస్టర్ సినిమా తెలుగులో రిలీజ్ అయితే గనుక అసలు థియేటర్లు దొరకడం చాలా కష్టం. తెలుగు జనానికి విజయ్ సుపరిచితుడే. స్నేహితుడు, తుపాకీ, విజిల్ సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. మరి ఇంత క్లిష్టమైన టైంలో సినిమా వస్తే థియేటర్లు దొరకక ప్రేక్షకులకు రీచ్ అవ్వకపోతే ఎలా అని మాస్టర్ దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. అనిరుధ్ సంగీత సారధ్యం వహిస్తున్న మాస్టర్ సినిమా పరిస్థితి ఏం కానుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే..
Tags:    

Similar News