రంగుల ప్రపంచంలో కసితో ఏదో సాధించాలనే తపన యువతరంలో ఉంటుంది. అయితే అశనిరాశల మధ్య అనుకున్నది సాధించుకునేది ఎందరు అనేది ఓ చిక్కు ప్రశ్న. కొందరికి మాత్రమే రాసి పెట్టి ఉంటుంది ఇక్కడ. చాలామంది బతుకు బండి ఇక్కడ ఎగుడుదిగుడుగానే రన్ అవుతుంటుంది. ఏదైనా సాధించేలోపే ఫిలింనగర్.. కృష్ణానగర్ లోనే జీవితాలు తెల్లారిపోతుంటాయి. కొందరు అయినవాళ్లను కాదనుకుని ఇల్లు విడిచిపెట్టి వచ్చి మరీ లక్ కోసం ట్రై చేస్తూ చివరికి ఇంటికి చేరని సన్నివేశం ఉంటుంది. నిరంతరం సినిమా కష్టాలు తప్పదు. తిండికి తికాణా లేని సన్నివేశం కొందరికి ఉంటుంది.
అయితే ఇటీవల లఘుచిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుని పెద్ద డైరెక్టర్లు అవుతున్న వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని నిత్యం వందలాది మంది యువతీయువకులు లఘు చిత్రాల పేరుతో నిరంతరం ఏవో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వీటిలోనూ సక్సెస్ రేటు తక్కువే. ఇకపోతే ఇలా వచ్చి లఘుచిత్రాలు తీస్తూ రంగుల కలలు గంటున్న ఓ యువదర్శకుడు.. కెమెరామెన్ అర్థాంతరంగా గోదారిలో గల్లంతవ్వడం సంచలనమైంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తూ.గో జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పిచుకులంక పరిసరాల్లో గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ లఘు చిత్రాల దర్శకుడు ... కెమెరామెన్ ఊబిలో కూరుకుపోయి మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతులిద్దరినీ పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు హైదరాబాద్ కి చెందిన కార్తీక్ (35) కాగా.. మరొకరు రాజమండ్రికి చెందిన సుధీర్ (33) గా గుర్తించారు. లఘుచిత్రాల దర్శకుడు సుధీర్ కి కెమెరామెన్ కార్తిక్ చాలా కాలంగా స్నేహితుడు. ఆ ఇద్దరూ కలిసి షార్ట్ ఫిలిం కోసం లొకేషన్ వెతికేందుకు గోదారి పరిసరాలకు విచ్చేశారు. అలా వచ్చి గోదారిలో స్నానానికి దిగాక ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాలు వెలికి తీశారు. కుటుంబ సభ్యులకు వివరాలు అందించి మృతదేహాల్ని పోస్ట్ మార్టమ్ కి తరలించిచారని తెలుస్తోంది. సినిమా ఆశతో వచ్చారు. అనంత లోకాలకు చేరిపోయారు. ఈ తరహా కథలెన్నో కృష్ణానగర్.. ఫిలింనగర్ లో రెగ్యులర్ గా బయటపడుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.