ఒకప్పుడు ఒక్కో హీరో ఒక్కో జోనర్ ను ఎంచుకుని ఆ రూట్లో ముందుకు వెళ్లేవారు. పల్లెటూరి బుల్లోడుగా ఫలానా హీరో బాగుంటాడు .. పట్నం చిన్నోడిగా ఫలానా హీరో బాగుంటాడని ముందుగానే ఫిక్స్ అయ్యేవారు. ఈ కారణంగానే ఒకరు యాక్షన్ హీరోగా .. మరొకరు రొమాంటిక్ హీరోగా దశాబ్దాల పాటు తమ జోరును కొనసాగించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒక హీరో ఒక జోనర్ కి సంబంధించి రెండు సినిమాలు కూడా చేయలేని పరిస్థితి. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే ఆడియన్స్ రిజక్ట్ చేస్తున్నారు.
అందువల్లనే యంగ్ హీరోలంతా ఎప్పటికప్పుడు తమ జోనర్లు మార్చుకుంటూ వెళుతున్నారు. తాము కొత్తగా కనిపించడానికీ .. కథ కొత్తగా అనిపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కథా కథానాలు కొత్తగా ఉన్నాయనుకుంటే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. అయితే ఏ హీరో ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఫ్లాపుల వల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఒక హిట్ వచ్చిన ఆనందాన్ని పూర్తిగా పొందేలోగా ఫ్లాపు పడుతున్నవాళ్లు కొందరైతే, వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న హీరోలు కొందరు.
'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని, ఆ తరువాత మరో ప్రయోగంగా 'అంటే .. సుందరానికీ' సినిమా చేశాడు. కానీ ప్రేక్షకులు పరాజయాన్ని పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఇక తన ప్రతి కథ కొత్తగా ఉంటుందంటూ చెబుతూ వస్తున్న శర్వానంద్ ఖాతాలో ఇప్పటికీ అరడజను ఫ్లాపులు నమోదు అయ్యాయి.
జోనర్లు మార్చుకుంటూ వస్తున్న ఆయనకి ఫ్లాపుల బాధ తప్పడం లేదు. ఇక నితిన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ జోనర్ నుంచి ఏ కథను ఎంచుకున్నా పరాజయాలు ఆయనను వెంటాడుతూ వస్తున్నాయి.
ఇక నాగశౌర్య విషయానికి వస్తే, ఆయన హిట్ అనే మాట వినేసి చాలా కాలమే అయింది. తన సొంత బ్యానర్లో .. బయట బ్యానర్లో ఎలా చేసినా ఆయన హిట్ అనే మాటకి చాలా దూరంలోనే ఉండిపోతూ వస్తున్నాడు. తనకి అచ్చొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ లోను .. తాను ఇష్టపడే యాక్షన్ కథలను చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది.
ఇక ఆల్రెడీ రెండు ఫ్లాపులను ఇచ్చేసిన విజయ్ దేవరకొండ కూడా, 'లైగర్' తో మూడో ఫ్లాపును లైన్లో పెట్టేశాడు. ఆడియన్స్ ను మెప్పించడానికి ఏ జోనర్లో ఎలాంటి సినిమాలు చేయాలో అర్థంకాని ఒక గందరగోళంలో యంగ్ హీరోలు ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఏం చేస్తాం .. ట్రెండ్ అలాంటిది మరి!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.