శ్రీ లీలా రాంగ్ రూట్ లో వెళ్తుందా..?

Update: 2022-06-16 00:30 GMT
పెళ్లి సందD సినిమా తో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీలా. రాఘవేంద్ర రావుకు నచ్చిన శ్రీలీలా మొదటి సినిమా తో ప్లాప్ ను చవిచూసింది. ఆ సినిమా ప్లాప్‌ అయినా కూడా శ్రీలీలా గురించి బాగా పాపులారిటీని దక్కించుకుంది. మొదటి సినిమా సక్సెస్‌ కాకున్నా కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్‌ లో ఈమె ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం రవితేజ సినిమా ధమాకా లో నటిస్తున్న ఈమె మరో మూడు నాలుగు సినిమాలకు ఇప్పటికే కమిట్‌ అయ్యింది.. మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడి కెరీర్‌ ప్లాన్‌ సరిగా లేదేమో అనిపిస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీలా చేస్తున్న సినిమాలన్నీ కూడా మీడియం రేంజ్ సినిమాలు.. స్టార్‌ హీరోల సినిమాలు ఏ ఒక్కటి కూడా లేదు. ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలంటే ఖచ్చితంగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించినప్పుడు మాత్రమే ఆ పేరు వస్తుంది. కాని శ్రీలీలా మాత్రం స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లను దక్కించుకోలేక పోతుంది.

శ్రీలీలా హీరోయిన్‌ గా స్టార్‌ హీరో సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. దాంతో ఈ అమ్మడి కెరీర్‌ మొత్తం ఇలా చిన్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను చేస్తూ ఉండాలేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. లక్ కలిసి వస్తే తప్ప మహేష్‌.. చరణ్‌.. ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె నటించే అవకాశాలను దక్కించుకోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ గా ఉన్న వారిలో దాదాపు అంతా కూడా కెరీర్ ఆరంభంలో స్టార్‌ హీరోలతో నటించిన వారే. కనుక శ్రీలీలా ఇప్పటికి అయినా కాస్త రూట్‌ విషయంలో జాగ్రత్త పడాలంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో శ్రీలీలాకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆ ఫాలోయింగ్‌ ను సద్వినియోగం చేసుకుని ఈ అమ్మడు అన్ని చోట్ల స్టార్‌ గా పేరు దక్కించుకోవాలని మనమూ కోరుకుందాం.
Tags:    

Similar News