సినిమాలో హీరో ఎన్నో సాహసాలు చేయాలి. తెరపై అవన్నీ నిజంగా హీరో చేసినట్లే కనపడాలి. అందుకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడతారు. సినిమా షూటింగులకు ప్రపంచంలోని అందమైన లొకేషన్లు.. కోట్లు ఖర్చు పెట్టి కళ్లు చెదిరే భారీ సెట్స్ వేస్తుంటారు. కథ వేరే లోకంలో సాగితే ఆ సెట్.. సముద్రంలో సాగితే అందుకు సంబంధించిన సెట్.. ఇక అంతరిక్షంలో సాగితే అలా సెట్స్ వేస్తుంటారు. వాటికి గ్రాఫిక్స్ జోడించి హీరో పాత్ర ద్వారా అద్భుతాలు ఆవిష్కరిస్తారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ మాత్రం సెట్ కాదు.. నిజమైన స్పేస్ లోనే షూటింగ్ చేయాలంటున్నాడు. అతి పెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫాను అమాంతం ఎక్కేసిన టామ్ క్రూజ్ ఇప్పుడు మరో పెద్ద సాహసానికి సిద్ధమవుతున్నారట. నిజమైన అంతరిక్షంలోనే సినిమా షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
ఇందుకోసం నాసా - ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ లతో కలిసి పనిచేయనున్నారని హాలీవుడ్ టాక్. యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు.. ఎవరు దర్శకత్వం వహిస్తారన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. అంతరిక్షంలో సినిమా చేయాలన్న ఆలోచన టామ్‌కు ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2018లోనే దీనిపై ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా టామ్ క్రూజ్ తో మాట్లాడారట. ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చితే మాత్రం టామ్ క్రూజ్ నటించబోయే ఈ చిత్రం భూమి బయట చిత్రీకరించిన మొదటి చిత్రంగా నిలుస్తుంది. ఇది అంతరిక్షంలో జరిగే అద్భుతమైన యాక్షన్ చిత్రంగా రూపొందనుందని.. అయితే ఇది మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో పార్ట్ కాదని.. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. నాసా అనుమతిస్తే స్పేస్‌లో షూటింగ్ జరుపుకునే ఫస్ట్ మూవీలో నటించిన రికార్డ్ టామ్ క్రూజ్ దే అవుతుందని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి త్వరలోనే అంతరిక్షంలో నిజంగా షూటింగ్ ఉంటుందా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాసిబుల్' సిరీస్ లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. దీంతో తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ‘మిషన్ ఇంపాసిబుల్:7’ చిత్రాన్ని ఈ ఏడాది జులై 23న విడుదల చేయాలి. కానీ 2021 నవంబరు 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పాటు ‘మిషన్ ఇంపాసిబుల్:8’ చిత్రాన్ని 2022 నవంబరు 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.