ఫ‌స్ట్ లుక్: తుఫాన్ లేస్త‌ది భాయ్

Update: 2019-10-01 05:57 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా -న‌రసింహారెడ్డి` చిత్రాన్ని  ఉత్త‌రాదిన రిలీజ్ చేస్తున్నారు ఫ‌ర్హాన్ అక్త‌ర్. ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ వ‌ల్ల ద‌క్షిణాదినా అత‌డి పేరు మ‌రోసారి మార్మోగుతోంది. అయితే అంత‌కుముందే ఫ‌ర్హాన్ కి ద‌క్షిణాదినా ఐడెంటిటీ తెచ్చిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. భాగ్ మిల్కా భాగ్.. జింద‌గీ నా మిలేగి దొబారా..  లాంటి చిత్రాల‌తో ఇక్క‌డా పేరొచ్చింది. ప్ర‌స్తుతం అత‌డు మ‌రో క్రేజీ సినిమాలో న‌టిస్తున్నాడు.

తుఫాన్ అనేది టైటిల్. తుఫాన్ ఉటేగా (లేస్త‌ది) అంటూ క్యాప్ష‌న్ లోనూ తుఫాన్ ని రిపీట్ చేశాడు. ఈ పోస్ట‌ర్ ని ఫ‌ర్హాన్ స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేశాడు. ఈసారి బ‌యోపిక్ కాకుండా పూర్తిగా ఫిక్ష‌న్ క‌థ‌తో రూపొందించిన చిత్ర‌మిది. ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఈ సినిమా కోసం చాలానే శ్ర‌మిస్తున్నార‌ని తాజాగా రివీలైన ఫ‌స్ట్ లుక్ తో అర్థ‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్ లో బాక్సింగ్ రింగ్ లో ఎయిర్ పంచెస్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదిరిపోయే టోన్డ్ బాడీతో కండ‌లు మెలితిరిగి క‌నిపిస్తున్నాడు. ఈ గెట‌ప్ కోసం బాక్స‌ర్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. నేచుర‌ల్ లుక్ రావ‌డానికి అత‌డు చాలానే శ్ర‌మించాడ‌ట‌.

భాగ్ మిల్కా భాగ్ (2013) చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి పూర్తి చేశారు. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 2 న రిలీజ్ కానుంది. సైరా పంపిణీదారుడు హీరోగా తుఫాన్ తెర‌కెక్కుతోంది. యాధృచ్ఛికంగానే అయినా.. చ‌ర‌ణ్ న‌టించిన హిందీ రీమేక్ చిత్రం జంజీర్ కి తెలుగులో తుఫాన్ అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  తుఫాన్ తో పాటు స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో ఫ‌ర్హాన్ న‌టించాడు. స్కై ఈజ్ పింక్ చిత్రం అక్టోబ‌ర్ లో రిలీజ‌వుతోంది.
Tags:    

Similar News