చెత్త సినిమాలు తీయడం ఓ గొప్ప ఆర్ట్! అన్నారు ఒక సినీపెద్ద. ఆయన అన్న మాటల్ని చెవికెక్కించుకున్నారో ఏమో మన దర్శకులు ఆ విషయంలో బాగానే పోటీపడ్డారు. 2018లో టాలీవుడ్ చెత్త సినిమాల జాబితాని పరిశీలిస్తే ఓ ఐదు సినిమాల్ని ప్రముఖంగా ప్రస్థావించాలి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన `అజ్ఞాతవాసి` చెత్త సినిమాల్లో నంబర్- 1 అని చెప్పాలి. పెద్ద బడ్జెట్ తో తెరకెక్కి ఎన్నో అంచనాల నడుమ భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో విషయం సున్నా అని క్రిటిక్స్ దుమ్మెత్తిపోశారు. అందుకు తగ్గట్టే వసూళ్ల పరంగా డిస్ట్రిబ్యూటర్ల కొంప ముంచండంతో లబోదిబోమన్నారు. అంత చెత్త కంటెంట్ లేకపోతే జనం ఎందుకు నిరాదరిస్తారు? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. సినిమాలో అస్సలు మ్యాటర్ లేదని, త్రివిక్రమ్ మ్యాజిక్ ఫెయిలైందని క్రిటిక్స్ ఓ రేంజులో విరుచుకుపడ్డారు. బాక్సాఫీస్ వద్ద సినిమా తేలిపోయింది. అలాగే నారా రోహిత్ ప్రయోగాల బాటలో వెళుతూ నటించిన `వీర భోగ వసంత రాయలు` పెద్ద నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా సెలక్షన్ పెద్ద రాంగ్ అన్న మాట వినిపించింది. సినిమా చూసిన వాళ్లకు తల బొప్పి కట్టడంతో పెదవి విరిచేశారు. ఎన్నో కష్టాల మధ్య రిలీజైన ఈ సినిమా అసలు ఆడిందో లేదో కూడా ఎవరికీ తెలియలేదు.
2018 ద్వితీయార్థంలో మాస్ మహారాజా రవితేజ ఏదో మ్యాజిక్ చేస్తాడనుకుంటే `అమర్ అక్బర్ ఆంటోని` ఫలితం భేజారెత్తించింది. శ్రీనువైట్ల తనకు ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు మాస్ రాజాతో పాటు శ్రీనూ కూడా పూర్తిగా సంక్షోభంలో పడిపోవాల్సొచ్చింది. గొప్ప సినిమాలు తీసిన మైత్రి మూవీస్ కి చెడ్డ పేరు తెచ్చినవాళ్లయ్యారు. కింగ్ నాగార్జున దేవదాస్ లాంటి క్లాసిక్ సినిమాలో నటించారు. సేమ్ ఏడాది `ఆఫీసర్` లాంటి చెత్త సినిమాలోనూ నటించారు. స్నేహితుడు ఆర్జీవీకి సాయం చేయబోయి చేసిన సాహసం కాస్తా బెడిసికొట్టింది.
ఎలానూ ఆర్జీవీ ఫ్లాపులే తీస్తాడులే అంటూనే ఫ్లాపు బాట పట్టాల్సొచ్చింది. చివరిగా సందీప్ కిషన్ నటించిన `నెక్ట్స్ ఏంటి?` చిత్రం గురించి చెప్పుకుని తీరాలి. సెక్స్ గురించి గొప్ప పాఠం చెబుతున్నాం.. యూత్‌కి కిక్కే కిక్కు! అంటూ ప్రచారం చేసి, చివరికి బాక్సాఫీస్ వద్ద అబాసుపాలయ్యారు. `వీరభోగ వసంత రాయలు` తరహాలోనే ఏం చూపించాలనుకున్నారో క్లారిటీ లేక చివరికి ఫ్లాపును నెత్తికెత్తుకున్నారు. అదండీ.. టాప్ 5 చెత్త సినిమాల జాబితా.