టాప్ స్టోరి: దీపావ‌ళి ధ‌న‌ల‌క్షి ఇంటికి రావాలంటే!

Update: 2019-10-23 06:38 GMT
దీపావళికి అంద‌రూ ట్రెడిష‌న‌ల్ గానే కాకుండా ట్రెండీ గానూ రెడీ అవుతుంటారు. ఎంచుకునే కాస్ట్యూమ్స్ కి త‌గ్గ‌ట్టే హెయిర్ స్టైల్ -యాక్సెస‌రీస్ వంటివి ఉండాలి. అలాంటి వాటిని పరిశీలించాలంటే ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ అంద‌గ‌త్తెల స్టైల్స్ ని చెక్ చేస్తే స‌రిపోతుంది.

ముఖ్యంగా డ్రెస్ కోడ్ కి త‌గ్గ‌ట్టే హెయిర్ స్టైల్ మెయింటెయిన్ చేయ‌డంలో దీపిక టాప్ ఫ్యాష‌నిస్టా. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. సైడు పాపిడి తీసి స్ట్రెయిట్ గా జుత్తు చెద‌ర‌కుండా నీట్ గా దువ్వేసి ఆ వెన‌క‌గా కింది వైపు ముడి వేసింది. ఆ హెయిర్ కూడా షైనీగా జెల్ అప్పియ‌రెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది.

కుర్ర బ్యూటీ ఆలియా భ‌ట్ అయితే ఇంకా సింపుల్ గా క‌నిపిస్తోంది. ఎలాంటి హ‌డావుడి క‌నిపించ‌కుండా ట్రెండీ లుక్ తో క‌నిపిస్తోంది. హెయిర్ స్ట్రెయిట్ గా నెక్ వెన‌క‌గా వ‌దులుగా ఉండేలా వ‌దిలేసింది.

ఇక సీనియ‌ర్ బ్యూటీ క‌రీనా క‌పూర్ అయితే ట్రెడిష‌న‌ల్ ఔట్ ఫిట్ కి త‌గ్గ‌ట్టే లో -పోనీ టెయిల్ (పిల‌క‌)ను వేసుకుంది. ఫెస్టివ్ ట‌చ్ ఇవ్వ‌లేదు కానీ.. త‌న నుదిటిన పాపిడి బొట్టు పెట్టుకున్నా సూట‌వుతుంది. అయితే కరీనా అద‌న‌పు హంగుల్ని లైట్ తీస్కుంది.

మ‌రో సీనియ‌ర్ బ్యూటీ ప్రియాంక చోప్రా చీర‌ ధ‌రించిన‌ప్పుడు హెయిర్ కి ఫ్రెష్ ఫ్ల‌వ‌ర్స్ ని ధ‌రించింది. అయితే హెయిర్ ని ముడి వేసి చుట్టూ పింక్ రోజెస్ ని ఆ ముడి చుట్టూతా తురిమింది. ఈ నాలుగు స్టైల్స్ నుంచి ఎవ‌రికి న‌చ్చిన వాటిని వాళ్లు అనుకరించ‌వ‌చ్చు.

శ‌ని (26అక్టోబ‌ర్)- ఆదివారా(27అక్టోబ‌ర్)ల్లో దీపావ‌ళి అమావాస్య. శ‌నివారం మొద‌లై ఆదివారం ముగుస్తుంద‌ని శాస్త్రం చెబుతోంది. మ‌రి ఆ రెండ్రోజులు ఇంటిల్లి పాదీ చుట్టాలు ప‌క్కాల‌తో సంద‌డిగా ఉంటుంది. దీపం కాంతుల‌తో ఇళ్లంతా క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్ములంతా ధ‌న‌ల‌క్ష్మి వేంచేసే త‌రుణం కోసం ఆస‌క్తిగా వేచి చూస్తారు.. చ‌క్క‌ని అలంక‌ర‌ణ అవ‌స‌ర‌మైన సందర్భం ఇదే.
Tags:    

Similar News