త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. హిట్ ఇచ్చిన జోష్ లో వెంటనే ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటెర్టైమెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'అరవిందసమేత వీరరాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. కాగా ఈ సినిమా ముందు అనుకున్న దాని ప్రకారం ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' కోసం తన రోల్ కి సంభందించిన షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించాలని భావించాడట. అయితే ఇప్పుడు పరిస్థితులు అన్ని మారిపోయాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు అనుమతి లభించినప్పటికీ ఎక్కువ మంది నటీనటులు సిబ్బందితో షూటింగ్ చేసే అవకాశం లేదు. దీంతో చిత్రీకరణ కొంచెం నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. అంటే ఆర్.ఆర్.ఆర్ మిగతా షూటింగ్ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో త్రివిక్రమ్ - తారక్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోయేది వచ్చే ఏడాదే అని అర్థం అవుతోంది. అంటే త్రివిక్రమ్ దాదాపు ఒక సంవత్సరం కేవలం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ గడిపేయాలన్నమాట. కాకపోతే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో మీడియం రేంజ్ సినిమా చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి ఎన్టీఆర్ ఒప్పుకోవాలి. ఈ పరిస్థితి ఒక్క త్రివిక్రమ్ కి మాత్రమే కాదు.. టాలీవుడ్ లోని చాలామంది డైరెక్టర్లకి ఉంది. ఇప్పటికే చిత్రీకరణ స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ మాత్రం ఏ ప్రాబ్లెమ్ లేకుండా తమ షూటింగ్ కొనసాగించనున్నారు. కానీ న్యూ మూవీ స్టార్ట్ చేసే డైరెక్టర్స్ కి ఇది పరీక్షా కాలమే అని చెప్పవచ్చు. వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి సురేందర్ రెడ్డి ఇలా చాలామంది డైరెక్టర్లు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ డైలమా సిచ్యువేషన్ నుండి వీరు ఎలా బయట పడతారో చూడాలి.