సరిగ్గా లెక్క చూస్తే కేవలం 17 రోజులు మాత్రమే చేతిలో ఉంది. డిసెంబర్ 21 విడుదలని ప్రకటించిన అంతరిక్షం 90000 కిమీపిహెచ్ తాలూకు హడావిడి మాత్రం కనిపించడం లేదు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన అంతరిక్షం టీమ్ నుంచి ఇప్పటిదాకా టీజర్ ప్లస్ సింగల్ ఆడియో ట్రాక్ తప్ప ఇంకే అప్ డేట్ బయటికి రాలేదు. ట్విట్టర్ వేదికగా మెగా ఫాన్స్ యూనిట్ ని నిలదీస్తున్నప్పటికీ స్పందన మాత్రం లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పబ్లిసిటీ మీద చాలా ఫోకస్ పెడితే తప్ప ఓపెనింగ్స్ కి గ్యారెంటీ ఉండటం లేదు. అలాంటిది ఇంత సైలెంట్ గా చప్పుడు చేయకపోతే ఎలా అంటున్న అభిమానుల ప్రశ్నలో లాజిక్ ఉంది.
మరోవైపు వరుణ్ తేజ్ మరో సినిమా ఎఫ్2 ప్రమోషన్ రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నామని దిల్ రాజు తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి ఇందాకే కన్ఫర్మ్ చేసారు. ఇంకా నెల రోజులున్న సంక్రాంతికి వచ్చే సినిమాలే ఇంత అలెర్ట్ గా ఉన్నప్పుడు అంతరిక్షం మౌనంలోని అంతరార్ధం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇక్కడ మరొక విషయం మర్చిపోకూడదు. డిసెంబర్ 21 వార్ వన్ సైడ్ లేదు. పోటీ చాలా తీవ్రంగా ఉంది. యూత్ ని టార్గెట్ చేసిన శర్వానంద్ సాయి పల్లవిల పడి పడి లేచే మనసు ఇప్పటికే హైప్ ని బాగా బిల్డ్ చేస్తోంది. మరోవైపు శంకర్ లాంటి దర్శకుడు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించిన కెజిఎఫ్ రిలీజ్ కూడా ఆ రోజే. హీరో యాష్ కు ఇక్కడ ఇమేజ్ లేకపోయినా కంటెంట్ మీద హైప్ వస్తోంది.
ఇక షారుఖ్ ఖాన్ జీరో గురించి చెప్పేదేముంది. మరి ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు అంతరిక్షం టీమ్ ఎందుకు నిర్లిప్తంగా ఉందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. పోనీ డ్రాప్ ఆలోచన ఉందేమో అనుకుంటే ఆ సూచనలూ లేవు. షూటింగ్ పూర్తయిపోయినా సంకల్ప్ తో సహా టీమ్ మెంబెర్స్ ఎవరూ ట్విట్టర్ లో కూడా పెద్దగా అలెర్ట్ గా లేరు. ఈ సస్పెన్స్ మరో రెండు మూడు రోజులు కొనసాగేలా ఉంది కానీ రెండు వారాల అతి తక్కువ టైంని ఒత్తిడిని అంతరిక్షం టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి