వసూళ్ల వరదకు బాహుబలి2 రెడీ!!

Update: 2017-03-31 06:39 GMT
రాజమౌళి సృష్టించిన చిత్రరాజం బాహుబలి ది కంక్లూజన్.. ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయిపోగా.. ప్రస్తుతం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు జక్కన్న అండ్ టీం. మరోవైపు వసూళ్ల విషయంలో కూడా బాహుబలి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

బాహుబలి2 చిత్రాన్ని ఇప్పటివరకూ ఏ సినిమాకు దక్కనంత భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించారు. వసూళ్లు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల వరకు బాహుబలి2 తొలి రోజునుంచే సెన్సేషన్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ-తెలంగాణల్లో తొలి రోజు వసూళ్ల రికార్డ్ మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 పేరిట ఉంది. మొదటి రోజున ఆ సినిమా రూ. 26.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి2కి ఈ మొత్తాన్ని దాటడం పెద్ద కష్టమేమీ కాబోదని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

ఎగ్జిబిటర్లు.. థర్డ్ పార్టీల నుంటి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తాలకు ఎంక్వైరీలు వస్తున్నాయి. తొలి రోజు వసూళ్లలో ప్రధానమైన ఫిక్సెడ్ హైర్స్ విషయంలో అయితే.. సీ డీ సెంటర్ల నుంచి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ వస్తున్నాయట. తొలి రోజున బాహుబలి2 కేవలం తెలుగు రాష్ట్రాల వరకే 40 కోట్లను కొల్లగొట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. బాహుబలి2 వసూళ్ల సునామీ సృష్టించేయడం మాత్రం ఖాయమే అని చెప్పచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News