ట్రైల‌ర్స్ హీట్:'అవ‌తార్ 2' వ‌ర్సెస్ 'బ్లాక్ పాంథ‌ర్ 2'

Update: 2022-04-30 04:31 GMT
స‌మ‌కాలీన ప్ర‌పంచంలో వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ.. ఒక‌దానితో ఒక‌టి పోటీ ప‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం అనేది హాలీవుడ్ సినిమాల‌కు ప‌రిపాటిగా మారింది. యూనివ‌ర్శ్ పేరుతో ప్ర‌త్యేకించి ఫ్రాంఛైజీ క‌ల్చ‌ర్ లో లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఒక విధంగా ఆధునిక మాన‌వుడు సృష్టికి ప్ర‌తిసృష్ఠి చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన అవ‌తార్ సంచ‌ల‌నాలు చెక్కు చెద‌ర‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఆ సినిమా ఇప్ప‌టికీ వ‌సూళ్ల ప‌రంగా నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది.  ఆ త‌ర్వాతే అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్. ఇప్పుడు త‌న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు కామెరూన్ అవ‌తార్ 2ని రిలీజ్ కి తెస్తున్నారు. డిసెంబ‌ర్ లో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల చుట్టూ ఆరా(ఆక‌ర్ష‌)ను క్రియేట్ చేయ‌బోతోంది.

అంత‌కుముందే ఈ సినిమా ట్రైల‌ర్ ను ప్ర‌తిష్ఠాత్మ‌క‌ సినిమా కాన్ ఉత్స‌వాల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనికి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేక‌పోయినా అవ‌తార్ 2 ట్రైల‌ర్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిగా క‌ళ్లు వెతుకుతూనే ఉన్నాయి. ఇంత‌లోనే ఇదే సినిమా కాన్ ఉత్స‌వాల్లో బ్లాక్ పాంథ‌ర్ 2 ట్రైల‌ర్ ని కూడా రిలీజ్ చేయ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. బ్లాక్ పాంథ‌ర్ అసాధార‌ణ విజ‌యం నేప‌థ్యంలో పార్ట్ 2 పైనా భారీ అంచ‌నాలున్నాయి.  నిజానికి బ్లాక్ పాంథ‌ర్ కోసం ఉప‌యోగించిన టెక్నాల‌జీపై అప్ప‌ట్లో ఎంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అవ‌తార్ కి స‌మాంత‌ర‌మైన అధునాత‌న టెక్నాల‌జీని విజువ‌ల్ మాయాజాలాన్ని ఈ చిత్రంలో ఆవిష్క‌రించ‌డ‌మే అందుకు కార‌ణం.

డిస్నీ మార్వెల్ బ్లాక్ పాంథర్ ప్రివ్యూను ఆవిష్కరించ‌నుంది. సినిమాకాన్ లో వకాండ ఫరెవర్ ఆఫ్ట‌ర్ చాడ్విక్ బోస్‌మాన్.. అంటూ హంగామాను షురూ చేశారు. ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో ఈ విజువ‌ల్ వెల్ల‌డిస్తుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. లాస్ వెగాస్‌లోని సినిమాకాన్ లో ప్రదర్శించ‌నున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం Black Panther: Wakanda Forever  నుండి మొదటి ఫుటేజీని డిస్నీ షేర్ చేసింది. డిస్నీ బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ నుండి మొదటి అధికారిక ఫుటేజీని ప్రదర్శించిన సిజిల్ రీల్ ను ప్రదర్శించింది. స్క్రీన్ రాంట్ టాబ్లాయిడ్ నివేదికల ప్రకారం.. ఫుటేజ్ లో లెటిటియా రైట్ షురి- లుపిటా న్యోంగో  నాకియా మరియు డానై గురిరాకు చెందిన‌ ఓకోయ్ యుద్ధం ముందు వరుసలో ఉన్న దృశ్యాన్ని చూపించారనేది టాక్. టి చల్లా చ‌నిపోవడంతో స్త్రీ పాత్రలు తమ ప్రజలను విజయపథంలో నడిపిస్తున్నట్లు ఈ విజువ‌ల్ లో కనిపించింది. బ్లాక్ పాంథర్ సీక్వెల్ అవ‌తార్ కంటే ముందే విడుద‌ల‌వుతుంది. 11 నవంబర్ 2022న విడుదలయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ ఎప్పుడైనా వస్తుందా లేదా అనే దానిపై ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. ప్ర‌స్తుతానికి సినిమా కాన్ ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శిస్తార‌ని మాత్రం చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ బ్లాక్ పాంథ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల చేస్తే వాకాండ ప్ర‌పంచం పండోరా ప్ర‌పంచానికి ధీటుగా క‌నిపిస్తుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

బ్లాక్ పాంథర్ కు సంబంధించిన వివరాల ప్ర‌కారం.. వకాండ ఫరెవర్ తారాగణంలో లెటిటియా రైట్ తాలూకా షురి- డానై గురిరా ఒకోయే లుపిటా న్యోంగో నాకియా విన్ స్టన్ డ్యూక్ M బాకు.. త‌దిత‌ర పాత్ర‌లు ఉన్నాయ‌ని మార్వెల్ స్టూడియోస్ ధృవీకరించింది. కెవిన్ ఫీగే డొమినిక్ థోర్న్ బ్లాక్ పాంథర్ 2 లో ఐరన్‌హార్ట్ గా ప్రవేశిస్తాడని ధృవీకరించినప్పటికీ వకాండా - అట్లాంటిస్ యుద్ధానికి వెళుతున్నప్పుడు నమోర్ అనే విలన్ ఉన్నాడ‌ని దీర్ఘకాల పుకారును స్టూడియో ఇంకా ధృవీకరించలేదు.

దర్శకుడు ర్యాన్ కూగ్లర్ సీక్వెల్ కోసం తిరిగి ప‌ని చేస్తున్నాడు. ఇది దిగ్గజ కింగ్ టి చల్లా లేనప్పుడు వకాండా దాని ప్రజలను అన్వేషించే క‌థ‌తో సీక్వెల్ కొనసాగుతుంది. ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్ మొండిగా ఉంటుంది. ఇది అసలు ప్రధాన పాత్రను తిరిగి  తీసుకురాదు. 2020 చివరలో స్టార్ చాడ్విక్ బోస్‌మాన్ నాలుగు సంవత్సరాలు క్యాన్సర్ తో పోరాడుతూ మరణించినప్పుడు సీక్వెల్ ఉంటుందా లేదా? అన్న డైల‌మా నెల‌కొంది. చిత్ర‌బృందం తీవ్ర‌ విషాదాన్ని ఎదుర్కొంది. బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ టి చల్లా లేకుండా రీటూల్ చేయడానికి అవసరమైన సమయాన్ని తీసుకుంది. అయితే మార్వెల్  కూగ్లర్ ఇప్పటికీ బోస్‌మాన్ వారసత్వాన్ని గౌరవించేలా సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు.ప్రకటించినప్పటి నుండి లెక్కలేనన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత డిస్నీ తన సినిమాకాన్ ప్రెజెంటేషన్ లో వకండ ఫరెవర్ కోసం నవంబర్ విడుదల తేదీని మళ్లీ ధృవీకరించింది. ఇది సంవత్సరం చివరి నాటికి ప్రతిదీ సిద్ధంగా ఉందని సూచిస్తుంది. ఈ చిత్రం 2022 నవంబర్ 11న విడుదల కానుంది.అవ‌తార్ 2 త‌ర‌హాలోనే ఈ ఏడాది విజువ‌ల్ మాయాజాలాన్ని ఆవిష్క‌రించే చిత్రంగా బ్లాక్ పాంథ‌ర్ 2 రికార్డుల్లో ఉంటుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.
Tags:    

Similar News