బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కామెడీ కంటెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ చిత్రాలతో పాటు వినోద నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. నటుడు గోవిందా తర్వాత కామెడీ నేపథ్యమున్న చిత్రాలతో ప్రేక్షకుల్ని నవ్వడించడంలో ఆయుష్మాన్ కే చెల్లింది. వినోదంలోనే వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'డాక్టర్-G' చిత్రం తెరకెక్కతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి హైప్ ని తీసుకొచ్చాయి. టీజర్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో ట్రైలర్ ఎలా ఉండబోతుంది? అన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా కొద్ది సేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. డాక్టర్ జి ఆద్యంతం నినోద నేపథ్యమున్న సినిమా అని తెలుస్తుంది.
ట్రైలర్ వినోద ప్రియల్ని ఆకట్టకుంటుంది. ఎమ్‌బీబీఎస్‌లో చేరిన ఆయుష్మాన్ ఖురానా ఆర్థో పెడిక్స్ చదవాలనుకుంటాడు. కానీ తనకు గైనకాలజీను కేటాయిస్తారు. సాధారణంగా గైనకాలజిస్ట్‌లు మహిళలే ఎక్కువగా ఉంటారు. దాంతో మహిళా వైద్యులతో స్టూడెంట్స్‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచారు.
మహిళా స్టూడెట్స్ మధ్య చదవడం..ప్రాక్టికల్స్ చేయడం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సీట్ మార్చాలని విజ్ఞప్తి చేసినా ఏదైనా డాక్టర్ కోర్సే కదా? మారడం దేనికంటూ ప్రోఫెసర్ నందిని శ్రీ వాస్తవ డిపార్ట్ మెంట్ చెప్పడం... ఆతర్వాత ఆయుష్మాన్ పాట్లు నవ్వు తెప్పిస్తుంది. స్త్రీ రోగులతో సుఖంగా ఉండటానికి అతని 'పురుష స్పర్శ'ని కనుగొనమని ఆమె అతన్ని అడుగుతుంది. ఆ సన్నివేశం హైలైట్.
రకుల్ ప్రీత్ సింగ్ తోటి వైద్యురాలిగా నటిస్తుంది. డాక్టర్ ఫాతిమా సిద్ధిఖి.. డాక్టర్ ఉదయ్ గుప్తా (ఖురానా) ప్రేమికురాలిగా నటించారు. ట్రైలర్‌లోని ఒక సన్నివేశంలో ఆమె అతన్ని ర్యాగింగ్ చేయడం మరో హైలైట్. మొత్తంగా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుందని చెప్పొచ్చు. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View