బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'స్వాతిముత్యం'. రొమాంటిక్ ఫన్ రైడ్ గా రూపొందిన ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సీరియస్ గా సాగుతూనే రొమాంటిక్ ఫన్ రైడ్ గా ఈ మూవీని దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ రూపొందించిన తీరు ఆకట్టుకుంటోంది.
టీజర్ నుంచి అంచనాల్ని పెంచేసిన ఈ మూవీని దసరా సందర్భంగా ఆక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా కొత్త తరహా కథతో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ అని స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ కి మరో పదిరోజులు మాత్రమే వుండటంతో చిత్కర బృందం ప్రమోషన్స్ విషయంలో దూకుడు పెంచేసింది. తాజాగా సోమవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది.
'నిన్న నైట్ ఒక మూవీ చూశానండి.. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే..కాఫీ షాప్ లో కలుస్తారు..' అంటూ హీరోయిన్ వాయిస్ లో ట్రైలర్ మొదలైంది. హీరో ఫస్ట్ పాయింట్ అంటూ మొదలు పెట్టడం .. దానికి హీరోయిన్ చెప్పండి అనడం.. సినిమా చాలా ఫ్రెష్ కంటెంట్ తో రొటీన్ కు భిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో రూపొందినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ లోని సన్నివేశాలని చూస్తుంటే ఇదొక రొమాంటిక్ లాప్టర్ రైడ్ గా ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వులతో అలరించేలా కనిపిస్తోంది.
రిఫ్రెష్ రొమాన్స్, భిన్నంగా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్.. ఆ సన్నివేశాలని మరింత అందంగా ఆవిష్కరించే సంగీతం.. ప్రతీ ఫ్రేమ్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ ఫార్చూన్ సినిమాస్ మేకింగ్ విలువలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇఒక పర్ ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనింగ్ ప్యాకేజీలా కనిపిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడికి ఊహించని వినోదాన్ని అందించడంతో ఈ మూవీ నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తుందనే గ్యారెండీ ట్రైలర్ లో కనిపిస్తోంది.
విభిన్నమైన మనస్తత్వాలు గల ఒక అమ్మాయి - అబ్బాయి కథలా ఆద్యంతం రిఫ్రెషింగ్ స్టోరీతో ఆకట్టుకునేలా వుంది. అనుకోకుండా కాఫీ షాప్ లో కలిసిన ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం.. అనూహ్య మలుపులతో పెళ్లి వరకు వెళ్లడం.. ఆ తరువాత హీరో జీవితంలో అనుకోని ట్విస్ట్.. ఆ తరువాతి వీరి ప్రేమకథ ఎలా సుఖాంతమైంది.. ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరం. రావు రమేష్ , బెల్లంకొండ గణేష్ మధ్య వచ్చే సన్నివేశాలు, హీరో, హీరోయిన్ ల కెమిస్ట్రీ సినిమాకు మిరంత హైలైట్ గా నిలుస్తోంది.
మహితి స్వరసాగర్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక ట్రైలర్ చివర్లో హీరోయిన్ చెప్పే 'ఓవరాల్ గా మా వాడు స్వాతిముత్యం అంతే' డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే బెల్లంకొండ గణేష్ తొలి సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీని అక్టోబర్ 5న సదరా కు రిలీజ్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View