ట్రెండ్‌ మారింది : ఆలస్యం విషం అవ్వడం లేదు

Update: 2019-11-27 06:27 GMT
పెద్దలు ఆలస్యం అమృతం విషం అంటారు. కొన్ని సార్లు ఆలస్యం అమృతం అవుతుంది మరికొన్ని సార్లు విషం అవుతుంది. కాని సినిమా ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు ఆలస్యం అవ్వడం విషమే అంటూ గతంలో టాక్‌ ఉండేది. సినిమాలు అనుకున్న సమయంకు విడుదల కాకుంటే ఆ సినిమాపై అప్పటి ప్రేక్షకులు బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పెట్టుకునే వారు. దాంతో చాలా సినిమాలు ఆలస్యం అవ్వడం వల్ల క్రేజ్‌ కోల్పోయాయి. చిరంజీవి నటించిన అంజి సినిమా చాలా ఏళ్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దాంతో ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

కాని ప్రస్తుత పరిస్థితి మారింది. ఆలస్యం అనేది ప్రస్తుతం విషం అవ్వడం లేదు. సినిమా చెప్పిన తేదీ కంటే చాలా ఆలస్యంగా వచ్చినా కూడా ప్రేక్షకులు ఆధరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అసలు ఈమద్య కాలంలో సినిమాల నిర్మాణం చాలా వరకు ఆలస్యం అవుతూనే ఉన్నాయి. ఏ సినిమాలు కూడా అనుకున్న సమయంకు పూర్తి అవ్వడం లేదు. కనుక ప్రేక్షకుల్లో కూడా ఈ ఆలోచన వచ్చింది. సినిమా విడుదలకు చాలా సమస్యలు ఉంటాయి. సినిమాను క్వాలిటీగా తీసుకు వచ్చేందుకు ఆలస్యం చేస్తున్నారు తప్ప బాగా లేక కాదనే ఆలోచన విధానంకు ప్రేక్షకులు వచ్చారు.

సినిమాలు నెలలకు నెలలు ఆలస్యంగా వచ్చినా కూడా వాటిపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పెట్టుకోవడం లేదు. ఆలస్యంగా అయినా వస్తుంది అంటే ఆ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సాహో మరియు సైరా సినిమాలు చాలా చాలా ఆలస్యం అయ్యాయి. అంతకు ముందు బాహుబలి మరియు  2.ఓ చిత్రాలు కూడా అనుకున్న సమయం కంటే ఏడాది ఆలస్యంగానే వచ్చాయి. అయినా కూడా వాటిని ప్రేక్షకులు ఆధరించారు.

సినిమా విడుదల వాయిదాలను పట్టించుకోకుండా అందులో మ్యాటర్‌ ఉండి ఆకట్టుకునే అంశాలు ఉంటే తప్పకుండా ఆ సినిమాను ప్రస్తుత ప్రేక్షకులు హిట్‌ చేస్తున్నారు. అందుకే ఆలస్యం విషం అనే టాలీవుడ్‌ ట్రెండ్‌ మారింది. టాలీవుడ్‌ లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ వస్తూనే ఉంటుంది. అలాగే లేట్‌ అయిన సినిమాలను లైట్‌ తీసుకునే ట్రెండ్‌ కూడా పోయింది. ఇది మంచి పరిణామం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News