కొంత మంది ట్రెండ్ సెట్ చేస్తారు.. కానీ ఫాలో అవ్వరు.. అయితే అలాంటి వాళ్లే కాలానుగుణంగా ట్రెండ్ ఫాలోవర్ గా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. ఇప్పడు దర్శకుడు శంకర్ ని చూస్తుంటే ఇదే మాటలు గుర్తొస్తున్నాయి. కెరీర్ ప్రారంభం నుంచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఆయన ఇప్పడు ట్రెండ్ ఫాలోవర్ గా మారిపోతుండటం ఆయన ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తోంది. భారతీయ విద్యా వ్యవస్థపై శంకర్ సంథించిన అస్త్రం 'జెంటిల్ మెన్' అప్పట్లో ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో.. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అలాగే లంచగొండి వ్యవస్థపై శంకర్ చేసిన 'ఇండియన్' కూడా పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. కమల్ ని చూపించిన తీరు, గ్రాఫిక్స్ ని, టెక్నాలజీని ఉపయోగించిన విధానం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక రాజకీయ వ్యవస్థపై శంకర్ సంధించిన అస్త్రం 'ఒకే ఒక్కడు'. ఈ మూవీతో సమకాలీన రాజకీయాలపై శంకర్ తనదైన స్టైల్లో స్పందించిన సంచలనం సృష్టించారు.
శంకర్ డైరెక్షన్ లో వచ్చిన 'అపరిచితుడు' ఓ సంచలనంగా నిలిచింది. 'జెంటిల్ మెన్' నుంచి 'రోబో' వరకు శంకర్ చేసిన ప్రతీ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచి సంచలనం సృష్టించినవే. అయితే ఆ తరువాత నుంచే శంకర్ తన మార్కు ని కోల్పోతూ వస్తున్నారు. 'బాహుబలి'కి ముందు దేశ వ్యాప్తంగా టాప్ డైరెక్టర్ గా జేజేలందుకున్న శంకర్ ప్లేస్ ని 'బాహుబలి' తరువాత రాజమౌళి సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి రాజమౌళి పేరు తప్ప శంకర్ పేరు వినిపించడం తగ్గిపోయింది. కారణం శంకర్ తన మార్కు సినిమాలకు భిన్నంగా అడుగులు వేస్తుండటమే.
ఒక దశలో శంకర్ మళ్లీ విజృంభించిన తనదైన మార్కు సినిమాలతో రాజమౌళిని వెనక్కి నెట్టేస్తాడని, తర్శకుడిగా మళ్లీ తన స్థానాన్ని దక్కించుకుంటాడని ప్రచారం జరిగింది. కానీ శంకర్ నుంచి అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ భారీ పొలిటికల్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో మధ్యలో ఆపేసిన 'ఇండియన్ 2'ని మళ్లీ పట్టాలెక్కించారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి.
వీటి తరువాత కూడా శంకర్ తమిళ నవల వేల్పారి ఆధారంగా మూడు భాగాలుగా ఓ భారీ ట్రియాజీకి శ్రీకారం చుట్టబోతున్నారు. తమిళంలో ఫూమస్ అయిన నవల ఆధారంగా భారీ ప్రాజెక్ట్ ని శంకర్ తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనకు కారణం ఇటీవల మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' అనే నవలతో సినిమా చేయడమే. అంటే శంకర్ ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనని పక్కన పెట్టి ట్రెండ్ ని ఫాలో కావాలనుకుంటున్నారని దీన్ని బట్టే స్పష్టమవుతోంది.
కెరీర్ ప్రారంభం నుంచి 'రోబో' వరకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శంకర్ త్వరలో రాజమౌళికి గట్టి పోటీగా నిలబడతాడని అంతా భావించారు కానీ అనూహ్యంగా శంకర్ తన పంథాకు పూర్తి భిన్నంగా ట్రెండ్ ని ఫాలో అవుతుండటం ఆయన ఫ్యాన్స్ ఎలాంటి డైరెక్టర్ ఎలా అయిపోతున్నాడని నిట్టూరుస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.