అతనో ఆవారా.. ఏ పని పాటా ఉండదు. స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఓ పెద్ద మనిషి అతను కనిపించినపుడల్లా ఏం చేస్తుంటావని అడుగుతుంటాడు. ఇలా ఓ పార్టీ సందర్భంగా మరోసారి ఆ పెద్ద మనిషి అతణ్ని కెలుకుతాడు. ముందు ‘వాట్ డు యు డు’ అని అడుగుతాడు. అతనేమో ‘ఐయామ్ ఫైన్’ అంటాడు. ఆ తర్వాత ఆ పెద్దమనిషి ‘ఎలా ఉన్నావని అడగట్లేదు. ఏం చేస్తుంటావని అడుగుతున్నా’ అంటాడు. ‘బుక్కు రాస్తున్నా’.. ఇదీ జవాబు. ‘ఏం బుక్’ అంటూ మళ్లీ ప్రశ్న. ‘‘నా సావు నేన్జస్తా.. నీకెందుకు?’’ అంటూ సీరియస్ గా జవాబు. అంతే ఒక్కసారిగా కేరింతలు. కడుపు చెక్కలయ్యేలా నవ్వులు. ‘పెళ్లిచూపులు’ థియేటర్లలో పరిస్థితి ఇది.
‘ఆనంద్’ సినిమాలో హీరో అన్నయ్యగా నటించి.. ఆ తర్వాత ‘ఆవకాయ్ బిరియాని’.. ‘కో అంటే కోటి’ సినిమాల్ని డైరెక్ట్ చేసిన అనీష్ కురువిల్లాకు.. ప్రియదర్శి అనే కొత్త కుర్రాడికి మధ్య వచ్చే సన్నివేశమిది. సినిమా చూసిన వాళ్లందరూ బయటికొచ్చి కూడా ఈ సన్నివేశం గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారిప్పుడు. సినిమాలో ఈ సన్నివేశం చూసి నవ్వని ప్రేక్షకుడుండడు. ‘నాసావు నేన్జస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్ అయితే మామూలుగా పేలలేదు. సోషల్ మీడియాలో ఈ సన్నివేశం గురించి.. ఈ డైలాగ్ గురించి జనాలు తెగ చర్చించుకుంటున్నారు. పెద్దగా హావభావాలేమీ ఇవ్వకున్నా.. హైదరాబాదీ తెలంగాణ యాసతో తనదైన శైలిలో డైలాగులు చెబుతూ భలే కామెడీ పండించాడు ప్రియదర్శి. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఈ నటుడికి మున్ముందు మంచి అవకాశాలే దక్కొచ్చు.