`రూలర్` సినిమాతో ఈ శుక్రవారం అభిమానుల ముందుకొస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇదో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందన్న సమాచారం ఉంది. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీంతో పాటు బాలయ్య ఈ ఏడాది మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.
నటసింహా బాలకృష్ణ ఇప్పటికే శతాధిక చిత్రాల హీరోగా సత్తా చాటారు. కెరీర్ 106వ చిత్రం ఇటీవల మొదలైంది. ఇకపై నటనకు కామా పెట్టి.. మరో కొత్త పాత్రలోకి బాలయ్య పరకాయం చేయబోతున్నారట. అదేమిటి? అంటే.. ఈసారి మెగా ఫోన్ పట్టి షాక్ ఇవ్వబోతున్నాడని ఓ వార్త లీకైంది. ఇన్నాళ్లు తనదైన పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సులతో నందమూరి అభిమానుల్ని మురిపించి మరిపించిన బాలయ్య ఈ కొత్త వృత్తిని సీరియస్ గానే తీసుకోనున్నారని చెబుతున్నారు.
ఇంతకీ ఏ సినిమా చేస్తారు? కథేమిటి? అంటే.. బాలకృష్ణ నటించిన `ఆదిత్య 369` సీక్వెల్ తెరకెక్కించే వీలుందట. సింగీతం తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369 అప్పట్లో ఏ స్థాయి సంచలనం సృష్టించిందో తెలిసిందే. చాలా అడ్వాన్స్ డ్ టెక్నాలజీని పరిచయం చేసిన చిత్రమిది. టైమ్ మెషీన్ నేపథ్యంలో కొత్తదనాన్ని పరిచయం చేసింది. ఈ సినిమా నటుడిగా బాలయ్యకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఆ మధ్య చాలా ప్రయత్నాలు చేశారు. `ఆదిత్య 999` అని టైటిల్ ని కూడా ఫైనల్ చేశారు. అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని బాలయ్య చెప్పడం. ఆ సమయంలో `గౌతమీపుత్ర శాతకర్ణి` తెరపైకి రావడంతో ఆ సినిమా మూలనపడింది. మళ్లీ దాన్ని బయటికి తీసుకురాబోతున్నారట బాలయ్య. సింగీతం శ్రీనివాసరావు కథతోనే.. బాలయ్య స్వీయదర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తారట. 2020 లో అందుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారన్న టాక్ వేడెక్కిస్తోంది.