ట్రెండీ టాక్‌: ఇంత‌కీ ఎవ‌రండీ ఈ జాతిర‌త్నం?

Update: 2021-03-14 11:30 GMT
న‌టవార‌సులు రాజ్య‌మేలే చోట కొత్త కుర్రాళ్ల‌కు అవ‌కాశాలు అంటే అంత ఈజీ కాదు. పైగా న‌ట‌వార‌సుల పేర్లను కూడా ప‌క్క‌న పెట్టి.. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఒక ఔట్ సైడ‌ర్ గురించి ఆరాలు తీయ‌డం అంటే అస‌లే ఆషామాషీ కాదు. ఎంతో మ్యాట‌ర్ ఉంటే‌నే కానీ అత‌డి పేరును ప‌దే ప‌దే ఫ‌ల‌వ‌రించ‌రు. ప్ర‌స్తుతం ఆ యువ‌హీరో పేరు ఆ రేంజులోనే మార్మోగుతోంది. ఇంత‌కీ ఎవ‌రు ఈ నవీన్ పోలిశెట్టి..? ఎవ‌రి తాలూకా ఈ తెలుగు జాతిర‌త్నం? అంటూ ఆరాలు తీస్తున్నారంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌స్తుతం ఉన్న న‌వ‌త‌రం హీరోల్లో ప్రామిస్సింగ్ హీరోగా త‌న‌ని తాను మ‌లుచుకుంటున్న న‌వీన్ పోలిశెట్టి స‌హ‌జ‌సిద్ధంగా పుట్టుకొచ్చిన న‌టుడు అన్న టాక్ వినిపిస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. నేచుర‌ల్ స్టార్ నాని..వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్.. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌..  నిఖిల్.. త‌ర‌హాలోనే అత‌డు కూడా త‌నదైన విల‌క్ష‌ణ‌త‌తో దూసుకెళుతున్నాడు. న‌టించిన తొలి చిత్రంతోనే స‌త్తా చాటాడు. అత‌డు న‌టించిన ఏజెంట్ ఆత్రేయ‌లో సోలో పెర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు జాతిర‌త్నాలు చిత్రంలో మ‌రో ఇద్ద‌రు క‌మెడియ‌న్ల‌తో క‌లిసి న‌వీన్ పోలిశెట్టి పండించిన కామెడీ అద్భుతంగా పండింది. ఒక రకంగా సినిమా ఏదైనా దానిని త‌న భుజ‌స్కంధాల‌పై న‌డిపించే ద‌మ్మున్న‌వాడిగా అత‌డి పేరు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మైండ్ లో రిజిస్ట‌ర్ అయ్యింది.

ఇక‌పై ఏదైనా క‌థ రాస్తున్నారు అంటే ర‌చ‌యిత మైండ్ లో లేదా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మైండ్ లో న‌వీన్ పేరు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో అంత‌గా ప్ర‌భావితం చేసిన మ‌రో న‌టుడు లేడ‌నేది ఇన్ సైడ్ గుస‌గుస‌. అత‌డికి క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల దీవెన‌లు పుష్క‌లంగా ఉన్నాయి. ప‌రిశ్ర‌మ‌లో అత‌డిపై అంత‌కంత‌కు పాజిటివిటీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

మ‌రోవైపు సూప‌ర్ స్టార్ మ‌హేష్ జాతిర‌త్నాలులో న‌వీన్ పోలిశెట్టి న‌ట‌న‌ను కీర్తించ‌డేగ గాక అత‌డు హీరోగా ఓ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. మునుముందు ప‌లు అగ్ర బ్యాన‌ర్లకు క‌మిట‌వ్వ‌నున్నాడ‌న్న స‌మాచారం కూడా ఉంది.

ఆరంభం 1-నేనొక్క‌డినే లో మ‌హేష్ అభిమానిగా క‌నిపించాడు. చిన్న పాత్ర‌ల‌తో మొద‌లై ఏజెంట్ ఆత్రేయ‌గా స‌త్తా చాటాడు. జాతిర‌త్నాలుతో ప‌రిశ్ర‌మ‌లో త‌న స్థానం మ‌రింత మెరుగైంది. ఆధార‌ప‌డ‌ద‌గ్గ న‌టుడు! అంటూ ఇప్పుడు ఇండ‌స్ట్రీ మురిసిపోతోంది. అత‌డికి గొప్ప భ‌విష్య‌త్ ఉంద‌న‌డానికి ఇంత‌కంటే ఏం నిద‌ర్శ‌నం కావాలి?
Tags:    

Similar News