ఇంకో అయిదు రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఆడియో విడుదలతో పాటు ప్రీ రిలీజ్ లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఇక మొదటి షో రిపోర్ట్స్ గురించి వెయిట్ చేయడం ఒక్కటే మిగిలింది. ఇదిలా ఉండగా తమిళ బ్లాక్ బస్టర్ గా నాలుగేళ్ల క్రితం వచ్చిన జిగర్ తండాను హరీష్ శంకర్ ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేసుంటాడా అనే అనుమానాలు జనంలో లేకపోలేదు.
కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఆ మూవీని అరవ సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులు ఆ టైంలోనే చూసేశారు. దబాంగ్ కే అన్ని మార్పులు చేసి గబ్బర్ సింగ్ గా హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ దీనికి ఆ మాత్రం చేయలేడా అనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది కానీ కొన్ని మార్పులు అంత ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండేవి. అలాంటి ఓ పాయింట్ మీదే ఫిలిం నగర్ డిస్కషన్స్ సాగుతున్నాయి
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో సెకండ్ హీరోయిన్ మృణాళినితో అధర్వ ప్రేమలో ఉంటాడు. కానీ వాల్మీకిగా నటిస్తున్న హీరో గణేష్ పాత్ర కూడా ఈ అమ్మాయి మీదే మనసు పారేసుకుంటుంది. కట్ చేస్తే ట్రయాంగిల్ లవ్ షురూ. తమిళ్ లో ఇలా ఉండదు. చాలా కీలకంగా అనిపించే ఈ మార్పును కేవలం వరుణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు ఉంది తప్ప నిజంగా కథ డిమాండ్ చేయడం అయితే కాదనే మాట వినిపిస్తోంది. అసలే పూజా హెగ్డేది క్యామియో కాని క్యామియో లాంటి పాత్ర. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుంది. భారం మొత్తం మృణాళిని మీదే ఉంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథను మన ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోగలరో లేదో ఈ వీకెండ్ తో తేలిపోతుంది. చూద్దాం