చెన్నై చిన్నది త్రిష పై వచ్చినన్ని వార్తలు... ఈ మధ్య కాలంలో ఏ సౌత్ హీరోయిన్ పైనా రాలేదు. జయలలితతో ఫోటోని చూపిస్తూ... త్రిష రాజకీయాల్లోకి వెళ్లనుందంటూ సోషల్ మీడియాలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నిటికీ ఫోటోతో సమాధానం చెప్పేసింది ఈ తమిళ సోయగం. జయం రవితో కలిసి త్రిష నటించిన 'సకళ కళా వల్లవన్' జూలై 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం.. స్పెషల్ డిజైనర్ వేర్లో కనిపించిన త్రిషని చూసినవారికి... మతిపోతోంది.
గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ మిడీ లో... ఖతర్నాక్ లుక్ తో కనిపిస్తోంది త్రిష. డ్రస్ ఎంత క్యాచీగా ఉందో... అమ్మడి ఫేస్ అంతకంటే కళకళలాడిపోతోంది. ఈమధ్య కాలంలో లుక్స్ తో త్రిష ఇంతగా ఆకట్టుకున్న సందర్భం ఇదే. ఇదంతా ఒక సినిమా ప్రమోషన్ కోసమే కాదండోయ్. కెరీర్ చివరి దశకు వచ్చేసిందని వార్తలొస్తున్న టైంలో.. చేతికి ఆరేడు ప్రాజెక్టులు వచ్చేసరికి... ఈ బ్యూటీ ఫేస్ వెలిగిపోతోంది. దాదాపు అన్నీ స్టార్ హీరోలవే కావడం సంథింగ్ స్పెషల్.
అంతా బాగానే ఉంది కానీ... ఈ హీరోయిన్ మళ్లీ పాలిటిక్స్ పై పెదవి విప్పేసింది. రాజకీయం అంటే అదేమైనా రొచ్చా? నాకు ఇప్పటికి రాజకీయం 40శాతమే తెలుసు, మిగతా 60 శాతం నేర్చుకోవాలని చెప్పింది కూడా. అంటే... పొలిటికల్ ఎంట్రీ లేటుగా అయినా... లేటెస్ట్ గా రావలన్నది త్రిష ఉద్దేశ్యమేమో. అన్నట్లు.. రాజకీయాలపై మాట్లాడేప్పుడు ఈ హీరోయిన్ ఫేస్ లో షైనింగ్ చూడాలి... అబ్బబ్బా.. అమ్మ తర్వతా నెక్ట్స్ నేనే అన్న ఫీలింగ్ మనసులో ఉందేమో అనిపించేసింది.