2018 తమిళ్ బ్లాక్ బస్టర్ 96 సంచలనాల గురించి తెలిసిందే. త్రిష కథానాయికగా - విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నందగోపాల్ నిర్మించారు. 96 చిత్రానికి - అందులో త్రిష - సేతుపతిల నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఆ ఒక్క బ్లాక్ బస్టర్ త్రిష కెరీర్ కి ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ కాంపిటీషన్ నడుమ 96 రీమేక్ హక్కుల్ని దిల్ రాజు చేజిక్కించుకున్నారు. సమంత- శర్వానంద్ జంటను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అదంతా అటుంచితే.. 96లో త్రిష నటనకు విమర్శకుల ప్రశంసలే కాదు.. 2018-19 సీజన్ లో ఉత్తమ నటిగా త్రిష పలు పురస్కారాల్ని గెలుచుకుందని ప్రఖ్యాత కోలీవుడ్ క్రిటిక్ రమేష్ బాలా ట్విట్టర్ లో వెల్లడించారు. అవార్డులు అందుకుని ఉన్న త్రిష ఫోటోల్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. రీసెంట్ గానే త్రిష ఆసియా విజన్ అవార్డును అందుకుంది. టీఎస్సార్ జాతీయ అవార్డుల్లో త్రిష పేరు వినిపించింది.
త్రిష ఇలా అవార్డులు గెలుచుకోవడంపై అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 96 చిత్రంలో త్రిష నటన అద్భుతం. అలాగని ఇతర భామలు నటించలేదా? అంటే.. `కాలా` చిత్రంలో ఈశ్వరి రావ్ అంతే గొప్పగా నటించారు. వడ చెన్నయ్ లో ఐశ్వర్యా రాజేష్ - తారామణి లో ఆండ్రియా పెర్ఫామెన్స్ మైమరిపించింది. అయితే వీళ్లలో త్రిష ప్రతిభను కమిటీ గుర్తించింది. కొన్నిసార్లు ఇతర ట్యాలెంట్ ని గుర్తించలేదని కూడా కామెంట్లు పోస్ట్ చేయడం విశేషం. అందరిలోనూ త్రిష పెర్ఫామెన్స్ అల్టిమేట్ కాబట్టే ఇన్ని అవార్డులు గెలుచుకుందనడంలో సందేహం లేదన్న విశ్లేషణా ఉంది.