బూతు సినిమా.. ఇరగాడేస్తోంది

Update: 2015-09-21 13:30 GMT
క్రిటిక్స్ అందరూ చెత్త సినిమా అన్నారు.. కాసుల కక్కుర్తితో తీసిన బి-గ్రేడ్ సినిమాలా ఉందన్నారు..  దారుణమైన రేటింగులిచ్చారు. కానీ క్రిటిక్స్ ఏమంటే ఏముంది.. జనాలు ఎలా ఆదరించారన్నదే ముఖ్యం. ఆ సంగతే రుజువు చేస్తోంది తమిళ సినిమా ‘త్రిష ఇల్లాన నయనతార’. పోయిన శుక్రవారం విడుదలైన ఈ సినిమా తమిళనాట దిమ్మదిరిగే కలెక్షన్ లు సాధిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా తొలి నాలుగు రోజుల్లోనే పది కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ రూ.7.5 కోట్ల దాకా ఉంది. ఫుల్ రన్ లో తక్కువలో తక్కువ పాతిక కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా. ఇంతా చేస్తే  ఈ సినిమా బడ్జెట్ రూ.5 కోట్ల లోపే.

ప్రేమకథా చిత్రమ్ రీమేక్ ‘డార్లింగ్’తో హీరోగా మారిన సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ నటించిన రెండో సినిమా ఇది. తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా చేసింది. మనీషా యాదవ్ మరో హీరోయిన్. ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఈ కాలం యూత్ కు బాగా కనెక్టయ్యే అడల్ట్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలరే మంచి కిక్కివ్వడంతో సినిమా చూడ్డానికి కుర్రాళ్లు బాగా ఎగబడుతున్నారు. లిప్ కిస్సులు - ఇంటిమేట్ సీన్ ల డోస్ బాగానే ఉంది. డబల్ మీనింగ్ డైలాగులు కూడా ఓ రేంజిలో పేలాయి. దీంతో వీకెండ్ అంతా సినిమా హౌస్ ఫుల్స్ తో నడిచింంది. సోమవారం కూడా స్టడీగా ఉన్న ఈ సినిమా నయనతార మూవీ ‘మాయ’ని, జయం రవి సినిమా ‘తనీ ఒరువన్’ని వెనక్కి నెట్టి తమిళ బాక్సాఫీస్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ ‘త్రిష లేదా నయనతార’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది.
Tags:    

Similar News