అందాల త్రిష మూడు పదుల వయసుకు చేరువైంది. పెళ్లాడేందుకు ఇదే సరైన టైమ్ అని భావించింది. అందుకే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం ఓకే చెప్పేసింది. బిజినెస్ మేన్ కం ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్ ని ఇక పెళ్లాడేయబోతోంది అనుకుంటుండగానే పిడుగులాంటి వార్త. వరుణ్‌తో ఈ పెళ్లి పెటాకులైంది అన్నదే ఆ వార్త. నిశ్చితార్థం పూర్తయ్యాక పెళ్లి క్యాన్సిల్ అంటే అది ఆ మగువను ఎంత బాధ పెట్టి ఉంటుంది.
అయినా ఒక ఐడియల్ ఉమెన్ గా త్రిష మరీ అంత కుంగిపోలేదు. ఏం జరిగినా నా మంచికే అనుకుంది. ఎక్కడా బాధను బైటికి చూపించకుండా తిరిగి కెరీర్‌ని రీ లాంచ్ చేసుకుంది. ఇప్పటికిప్పుడు బిజీ స్టార్ గా సెట్స్ లో గడిపేస్తోంది. ఒకసారి పెళ్లి ప్రయత్నం అలా అయ్యింది. ఇక పెళ్లాడుతారా? ఆడరా? అన్న ప్రశ్నకు... త్రిష అంతే షార్ప్ గా సమాధానం చెప్పింది. అవును నేను ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నా. పెళ్లి కూడా అంతే ఈవెంట్యువల్ గా జరుగుతుంది. ఇదంతా సమాజం కోసం కాదు. నా కోసం. ఒక వయసు వచ్చాక పెళ్లి అనేది చాలా ముఖ్యం. అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని అంది.
ఎవరో ఒక మారాజు నా కోసం వస్తాడు. అతడిని వలచేందుకు నేను సిద్ధమేనని చెప్పింది త్రిష. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయ్ కాని.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకరితో మరోసారి రొమాన్సు స్టార్టు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం ఉందా? లేదా? ఆ కండల రాకుమారుడి గురించి ఏమందువు త్రిషమ్మా? కాస్త క్లారిటీ ఇచ్చుకో...