చెన్నై బ్యూటీ త్రిషా క్రిష్ణన్ తల్లి ఉమా కృష్ణన్.. చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ ను కలిశారు. తన కూతురుకు రక్షణ కల్పించాలని.. అలాగే త్రిషకు సంబంధించిన ట్విట్టర్ పేజ్ ను హ్యాక్ చేసిన వారిని పట్టుకోవాలని కమిషనర్ కోరారామె.
చిన్నప్పటి నుంచి కుక్కలంటే తెగ ఇష్టపడే త్రిష.. పెటాకు క్యాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష ట్విట్టర్ పేజ్ లో ట్వీట్ పెట్టేసరికి.. తమిళనాడు జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివగంగ జిల్లాలో గర్జనై షూటింగ్ లో ఉన్న త్రిషపైకి దాడి చేశారు కూడా. వ్యానిటీ వ్యాన్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. 'నేను జల్లికట్టును కానీ.. తమిళనాడు జనాల సంప్రదాయాలను కానీ వ్యతిరేకించలేదు. నేను పుట్టకతో తమిళియన్ ని. తమిళ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తాను. నా సొంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు' అని వివరణ ఇచ్చింది.
అయినా సరే.. ఇంకా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన త్రిష తల్లి ఉమా కృష్ణన్.. 'చిన్నప్పటి నుంచి తనకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే పెటాకు ఫోటో షూట్ చేసి కొన్ని కుక్కలను దత్తత తీసుకుంది. ఆ సంస్థతో తన రిలేషన్ అంతే. మేము తమిళియన్స్.. జల్లికట్టుకు మేము వ్యతిరేకం కాదు' అంటూ తన కంప్లెయింట్ లో వివరించింది త్రిష మదర్. ఇక త్రిష ట్విట్టర్ పేజ్ గురించిన వివాదం గురించి చెబుతూ.. 'ఎవరో తన అకౌంట్ ని హ్యాక్ చేసి జల్లికట్టుకు వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. దీంతో వెంటనే తన అకౌంట్ ని త్రిష డీయాక్టివేట్ చేసింది' అని చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/