చెన్నై బ్యూటీ త్రిష తొలిసారిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ నాయకి. దెయ్యం గెటప్ వేసేసి భయపెట్టేస్తానంటూ త్రిష చెప్పినపుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే.. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కానీ త్రిష లెక్క చాలామందికి అర్ధం కాలేదు. పాత కాలం నాటి లుక్ తో ఇరగదీసేసింది నాయకి. ఇప్పుడీ సినిమా సెన్సార్ పూర్తి చేసేసుకుని రిలీజ్ కి రెడీ అయింది.
నాయకి సెన్సార్ పూర్తి గురించి త్రిష స్వయంగా ట్వీట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. 'నాయకి సెన్సార్ పూర్తైంది. సింగిల్ కూడా లేకుండా సర్టిఫికేట్ వచ్చింది. మొదటి పాజిటివ్ రిపోర్ట్ సెన్సార్ నుంచ లభించింది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అంటూ ట్విట్టర్ ద్వారా పోస్టర్ ని విడుదల చేసింది త్రిష. పట్టు చీర కట్టుకుని పూలబుట్ట చేతిలో పట్టుకుని.. మరో చేత్తో రక్తం ఓడుతున్న వేట కత్తితో త్రిష 'అందం'గా కనిపిస్తోంది.
అయితే.. నాయకికి లభించిన సెన్సార్ సర్టిఫికేట్ సంగతి మాత్రం త్రిష చెప్పలేదు. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ లభించింది. ఇప్పటికైతే రిపోర్టులు బాగానే ఉన్నాయి. అటు అందంతోను.. ఇటు దెయ్యంగాను త్రిష గెటప్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.