నేనా.. నయనతారతో నటించనన్నానా?

Update: 2016-01-31 13:30 GMT
త్రిషకు, నయనతారకు అస్సలు పడదని కోలీవుడ్లో గట్టి ప్రచారమే ఉంది. తమిళ, తెలుగు భాషల్లో తన ఆధిపత్యానికి గండి కొట్టిన నయన్ అంటే త్రిషకు మంట అని.. ఆమెతో కలిసి నటించాల్సిన అవసరం వచ్చినా ఆమె ఒప్పుకోలేదని అంటారు అక్కడి జనాలు. ఐతే ఇదే మాట త్రిష దగ్గర ప్రస్తావిస్తే... అలాంటిదేమీ లేదంటోంది. ‘‘నిజంగా నయనతార మీద నాకు అలాంటి అభిప్రాయం ఉంటే.. నేనే ఆ విషయాన్ని నా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసేదాన్ని కదా. నయన్ నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరికీ సరిపడే కథ రాలేదు కాబట్టే ఆమెతో నటించలేదు. అలాంటి కథ వస్తే కచ్చితంగా కలిసి నటిస్తాం’’ అని చెప్పింది త్రిష.

రానాతో తనకు ఇప్పటికీ మంచి స్నేహమే ఉందని.. మళ్లీ తామిద్దరం దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తమ బంధాన్ని ప్రేమా అని అడగడం కరెక్ట్ కాదని త్రిష చెప్పింది. ఆర్య తనను చెల్లెలు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గురించి త్రిష దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అవునా. అతను అలా అన్నాడా? ఈ విషయం కచ్చితంగా అతణ్ని అడిగి తీరుతాను. ఆర్య నాకు మంచి స్నేహితుడు. అతణ్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఏమైనా పంచుకోవచ్చు’’ అని చెప్పింది. తాను పార్టీ గర్ల్ అనే ప్రచారం గురించి మాట్లాడుతూ.. ‘‘స్నేహితుల పుట్టిన రోజులు అవీ జరిగితే వెళ్తా. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడతాం. అంతమాత్రాన రోజూ నేను పార్టీలకు వెళ్తానని.. ఎంజాయ్ చేస్తానని దుష్ప్రచారం చేయడం తగదు’’ అని చెప్పింది.
Tags:    

Similar News