ఒకటి కంపల్సరీ అంటోంది త్రిష

Update: 2015-09-09 19:57 GMT
రకరకాల ట్వీట్ లతో... జనాల్లో క్వశ్చన్ మార్క్ లు మిగులుస్తోంది త్రిష. రీసెంట్ గా 20 లక్షల ఫాలోయర్స్ మార్క్ ని అందుకుని రికార్డుల కెక్కిన ఈ సీనియర్ హీరోయిన్... తాజాగా ఓ ట్వీట్ పెట్టింది. నా జీవితంలో ఇప్పుడు నేనే పనైనా చేయాలంటే...  .అది నాకు సంతోషాన్ని ఇచ్చేదైనా అయ్యుండాలి... లేదా డబ్బులు తెచ్చిపెట్టేదైనా అవాలి. ఈ రెండింటిలో ఏ ఒకటైనా లేకపోతే... టైం కేటాయించలేను అని పోస్ట్ చేసింది త్రిష.

కొటేషన్ కత్తిలా ఉంది. తన లైఫ్ నుంచే నేర్చుకున్న  పాఠాలతోనే ఇలాంటి అభిప్రాయానికి వచ్చిందేమో అనిపిస్తుంది. నిజానికి త్రిష సినీ  గ్రాఫ్ ని చూసుకుంటే... గ్లామర్ రోల్స్ తప్ప. చరిత్రలో మిగిలిపోయే పాత్రలు చేయలేదు. పోనీ లైఫ్ లో అయినా ఏమన్నా సాధించిందా అంటే... నిశ్చితార్ధం వరకూ వచ్చిన పెళ్లి కూడా  ఆగిపోయింది. దీంతోనే ఇలా డబ్బో, సంతోషమో ఏదో ఒకటి కంపల్సరీ అనే స్థితికి త్రిష వచ్చేసింది అనుకుంటున్నారు ఫ్యాన్స్.

పదేళ్లకుపైగా సినిమాలు చేసినా ఇఫ్పటివరకూ పెద్దగా మిగుల్చుకోలేకపోయింది త్రిష. ఇకనైనా జాగ్రత్తపడదాం అన్న యాంగిల్ బాగానే ఉంది కానీ... ఇప్పటికే బాగా లేటయిందేమో ఆలోచించాల్సి ఉంటుంది. సీనియర్ కావడంతో... తక్కువ సంఖ్యలో అయినా... ఇప్పుడే కాస్త బెటర్ కేరక్టర్ లు వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో నాయకి అనే హీరోయిన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ లో కనిపించబోతోంది చెన్నై సుందరి.
Tags:    

Similar News