ఈత కొడుతూ అన్నింటిని క‌రిగించేస్తుంది

Update: 2015-10-16 12:40 GMT
అందాల త్రిష కు మూడు ప‌దులు దాటి చాలాకాల‌మైంది. ఇప్ప‌టికీ అదే ఛార్మింగ్ ను మెయింటెన్ చేస్తోంది.   సొగ‌స‌రి బికినీ వేసినా...టూ పీస్ లు చుట్టుకున్నా..స్వీమ్ షూట్ లో క‌నిపించినా హృద‌యాలు ఆగిపోవ‌డం ఖాయం. అయితే అలాటి ఫీట్ మ‌రోసారి అమ్మడు రిపీట్ చేసింది. సోష‌ల్ వెబ్ సైట్ లో స్వీమ్ షూట్ ధ‌రించిన స్టిల్ ఒక‌టి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏ నోట విన్నా అదే మాట‌. అయితే స్వీమ్ షూట్ వేసుకున్న‌ది సినిమాల కోసం  కాదు. సొగ‌స‌రి బాడీ ఫిట్ గా ఉండ‌టం కోసం...ఆరోగ్యం కోసం అని  రివీల్ చేసింది. ఫిట్‌ గా ఉండటం కోసం త్రిష డైలీ వర్కవుట్స్ చేస్తుంది.

జిమ్..యోగా. ఇలా రోజు దిన చ‌ర్య‌లు. అయితే వీట‌న్నికి మించిన ఉత్త‌మ‌మైన మార్గం మ‌రొక‌టి కూడా ఉంద‌ని చెప్పుకొచ్చింది. అదే ఈత కొట్ట‌డం. వర్కవుట్స్‌ లో స్విమ్మింగ్ తన ఫస్ట్ లవ్ అని త్రిష చెప్పింది.  శరీరంలోని అన్ని భాగాలనూ కదిలించే ఈతకు మించిన బెస్ట్ వర్కవుట్ లేదట‌. సూర్యుడు అస్తమించే సమయంలో ఈత కొలనులోకి దిగేస్తుంద‌ట‌. ఏకధాటిగా యాభై సార్లు ఈత కొట్టి, ఫస్ట్ లవ్‌ ని ఎంజాయ్ చేస్తుంద‌ట. కొవ్వును క‌రిగించ‌డానికి ఇది సులువైన మార్గం అని చెప్పుకొచ్చింది. మొత్తానికి చాలా రోజుల‌కి మ‌ళ్లీ ఇలా హాట్ హాట్ గా క‌నిపిస్తు కుర్రాళ్ల‌ను కుదిపేస్తుంద‌న్న మాట‌.
Tags:    

Similar News