త్రివిక్రమ్ - బన్నీ ఫుల్ హ్యాపీ కారణం అతనే !

Update: 2019-10-30 01:30 GMT
కొన్ని బడా సినిమాలు సెట్స్ పైకి రాకముందే టెక్నీషియన్స్ విషయంలో చర్చలు జరగడం సహజమే. సరిగ్గా 'అలవైకుంఠపురములో' కి కూడా అదే జరిగింది. 'అరవింద సమేత' తర్వాత బన్నీ తో సినిమా అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరు ని సజిస్ట్ చేసాడు త్రివిక్రమ్. అయితే బన్నీ మాత్రం తమన్ మ్యూజిక్ మోనోటనీ అని భావించి దేవీను తీసుకోవాల్సిందిగా కోరాడు. కొన్ని రోజులు హాట్ హాట్ గా డిస్కర్షన్ నడిచింది.

కట్ చేస్తే థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ మాట విని బన్నీ కూడా చివరికి థమన్ కే ఓటేశాడు. అయితే థమన్ పై మాత్రం అప్పట్లో ఒత్తిడి పెట్టాడు త్రివిక్రమ్. సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాకు బెస్ట్ సాంగ్స్ ఇవ్వాలని సూచించాడు. ఇక ఆ మాటను సీరియస్ గా తీసుకున్న థమన్ ఎట్టకేలకు రెండు పాటలతో సినిమాపై ఓ రేంజ్ బజ్ తీసుకొచ్చాడు.

ముందుగా విడుదలైన 'సామాజవరగమన' ఈ మధ్య కాలంలో బెస్ట్ మెలోడీ అనిపించుకుంటే రెండో పాట రాములో రాములా బెస్ట్ మాస్ నంబర్ అనిపించుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు అదిరిపోయే సాంగ్స్ అందించి త్రివిక్రమ్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు థమన్. మరి మిగతా పాటలు కూడా ఇదే రేంజ్ లో ఉంటే సినిమాకు ఆల్బమ్ అతి పెద్ద ప్లస్ పాయింట్ అవ్వడం ఖాయం.


Tags:    

Similar News