నితిన్ తో త్రివిక్రమ్ చేస్తున్న అఆ చివరి దశకు చేరుకుంటోంది. ఫిబ్రవరిలో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇంతలో త్రివిక్రమ్ కొత్త సినిమాకి సంబంధించిన సన్నాహాలు ఊపందుకొన్నట్టు తెలుస్తోంది. తదుపరి సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్. ఆ సినిమా తెలుగు - తమిళంతోపాటు హిందీలోనూ తెరకెక్కే అవకాశాలున్నాయట. కథ నచ్చడంతో సూర్యనే ఆ సినిమాని నిర్మించాలని డిసైడైయ్యాడట. అందుకే అందులో హీరోయిన్ గా నేషనల్ వైడ్ గా గుర్తింపున్న అమ్మాయిని సెలక్ట్ చేసుకొంటున్నాడట. ఆ మేరకు దీపికా పదుకొణేతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఇటీవల దీపికా చాలా బిజీగా గడుపుతోంది.
హాలీవుడ్ నుంచి కూడా ఆమెకి అవకాశాలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె సూర్య సినిమా చేయడానికి ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్న. కానీ దీపికాకి కథ నచ్చితే అది రీజనల్ సినిమానా మరొకటా అని చూడదు. ఆమధ్య రజనీకాంత్ తో కలిసి కోచ్చడయాన్ లోనూ నటించింది. పైగా ఆమె దక్షిణాదికి చెందిన అమ్మాయి కాబట్టి దక్షిణాది చిత్రాల్లో నటించడానికి దాదాపుగా అభ్యంతరం చెప్పదట. పారితోషికం విషయంలోనే వ్యవహారం కాస్త ఖరీదుగా ఉంటుంది. అయినా సూర్య మాత్రం దీపికా ఓకే అంటే ఎంతైనా ఇవ్వడానికి రెడీ అన్నట్టు ఉన్నాడట. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ చెప్పే కథ మాత్రమే ఆమెకి నచ్చాలి.