ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అరవింద సమేత` అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఆన్ లైన్ జామ్ అయిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటెంట్ పై జనాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫ్యాక్షన్ యాక్షన్ సినిమా అంటే మళ్లీ పాత తెలుగు సినిమాల పోలిక ఉంటుందేమో? తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు కొదవేంటి? అన్న ప్రశ్న తలెత్తింది. అంతేకాదు.. అప్పట్లో కోబలి అనే లైన్ తో పవన్ హీరోగా త్రివిక్రమ్ సినిమా తీయాలనుకున్నారు. ఆ కథలోనే ఎన్టీఆర్ నటించారా? అన్న సందేహం నెలకొంది.
ఇవే ప్రశ్నల్ని మాటల మాయావిపై నేటి ఇంటర్వ్యూలో మీడియా సంధించింది. వీటికి త్రివిక్రముడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అరవింద సమేత పూర్తిగా ఎమోషన్ .. యాక్షన్ పైనే దృష్టి సారించి తెరకెక్కించిన సినిమా. ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త ఒరవడి చూపించే ప్రయత్నం చేశాను. ఫ్యాక్షన్ హత్యల వల్ల ఆ కుటుంబాల్లో ఎలాంటి కల్లోలం ఉండేది.. గొడవ అయిపోయాక ఆ ఇంటి మహిళల్లో ఆవేదన ఎలా ఉండేది? వారు పెనిమిటితో ఏం కోరుకునేవారో అన్న కోణాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాను. ఇది ఎక్స్ క్లూజివ్ యాంగిల్. మునుపెన్నడూ చూడనిది.. అని తెలిపారు.
అయితే కొందరు మాత్రం ఎన్టీఆర్ తో తీస్తున్నది పవన్ కి వినిపించిన కోబలి లైన్ తోనే.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కోబలి పవన్ తో చేయాలనుకున్నది నిజమే కానీ అది వేరు ఇది వేరు అని త్రివిక్రమ్ తెలిపారు. `అరవింద సమేత- వీరరాఘవ`కు ఆ లైన్ తో ఏ సంబంధం లేదు. పూర్తి సాలిడ్ గా కమర్షియల్ పాయింట్ తో తీసిన చిత్రమిది. ఫ్యాక్షన్ .. యాక్షన్ అయిపోయాక... యుద్ధం ముగిసిపోయాక.. ఆ టెన్షన్ సిట్యుయేషన్ ని సీమ ఆడాళ్లు ఎలా హ్యాండిల్ చేశారన్నదే మా సినిమాలో అసలు సిసలు పాయింట్! అంటూ చెప్పుకొచ్చారు.