సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ - మహేష్ ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ యూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టారు.
యాక్షన్ ఘట్టాల నేపథ్యంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. తరువాత బ్రేక్ ఇవ్వడం.. అదే సమయంలో మహేష్ కు త్రివిక్రమ్ ఇచ్చిన ఫైనల్ నరేషన్ నచ్చకపోవడం.. మదర్ ఇందిర మృతి చెందడం వంటి కారణాలతో తదుపరి షెడ్యూల్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఫైనల్ గా మహేష్ కు త్రివిక్రమ్ కథలో మార్పులు చేసి కొత్త కథ వినిపించడం.. మహేష్ ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
దీంతో కొత్త కథతో ముందు వెళ్లడానికి రెడీ అయిపోయిన నేపథ్యంలో మహేష్ ఫాదర్ కృష్ణ చనిపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ బాధ నుంచి మహేష్ తేరుకోవడానికి సమయం పట్టడం, కొత్త కథ ఫైనల్ చేయడంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి మొదలయ్యే అవకాశం వుందనే వార్తలు వినిపించాయి.
కానీ మ్యూజిక్ సిట్టింగ్స్ తో పాటు మహేష్ రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధంగా లేకపోవడంతో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ ని గురూజీ మొత్తానికి మార్చేశాడు.
డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి కాకుండా జనవరి నుంచి సెట్స్ పైకి వెళుతున్నట్టుగా శని వారం చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించి క్లారిటి ఇచ్చేసింది. షూటింగ్ కి అంతా సిద్ధం.. ఉత్సాహం మరియు గొప్ప శక్తితో SSMB28 జనవరి నుండి నాన్ స్టాప్ గా సెట్స్ పైకి వెళ్తుంది. వేచి చూడండి.. మరిన్ని అప్ డేట్ లు మీ ముందుకు రాబోతున్నాయి' అంటూ ప్రకటించారు. ఇక సూర్యదేవర నాగవంశీ కూడా ట్వీట్ చేశాడు.
మేము సిద్ధంగా వున్నాము.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న SSMB28 రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా ప్రారంభం అవుతుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ను చూసేందుకు సిద్ధంగా వుండండి' అని ట్వీట్ చేస్తూ మహేష్ తో వున్న ఫొటోని పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ అప్ డేట్ నెట్టింట వైరల్ గా మారి మహేష్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.