సన్నాఫ్ సత్యమూర్తి సమీక్షకుల తీరుతెన్నులపై దర్శకుడు త్రివిక్రమ్ ఓ రేంజులోనే విరుచుకుపడ్డారు. సినిమా బావుంది అంటూనే బాలేదు అని రాశారని, అందుకే సమీక్షలు చదవను అని అన్నారాయన. అంతేకాదు సమీక్షకులు ఎలా ఆలోచిస్తారో పూస గుచ్చుతూనే, ఇతర విషయాలు ముచ్చటించారు... అవి యథాతథంగా మీకోసం...
రివ్యూలు రాసేవాళ్లు సినిమా చూస్తున్నంత సేపూ దాన్ని ఎంజాయ్ చేస్తూ రాయరు. ఎక్కడ ఏ లోపం ఉందా? అని వెతుకుతూ చూస్తారు. అందువల్ల సినిమాని ఎంజాయ్ చేయనూ లేరు. అలాంటప్పుడు ఆ రివ్యూల్లో నిజాయితీ ఎక్కుడ ఉన్నట్టు? అందుకే సమీక్షలు అస్సలు చదవను. బావుంది అని ఒప్పుకోవడానికి మనసే రాదు. బాగుంది.. కానీ అంటూ లోటుపాట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ప్రేక్షకులు నిజాయితీగా ఉంటారు. బావుంటే బావుందని అంటారు. లేదంటే నచ్చలేదు అని చెప్పేస్తారు. సినిమాని చూస్తూనే ఉంటాం. కానీ అందులోంచి బైటికి వచ్చేస్తాం. అందువల్ల ఎంత చూసినా నచ్చదు.
ఒకసారి ఛత్రపతి ఫస్టాఫ్ చూసి బైటికి వచ్చాం. నేను, నా స్నేహితుడు చాలా బావుందని గొప్పగా ముచ్చట్లాడుకుంటున్నాం. అంతలో ఓ వ్యక్తి వచ్చాడు. సెకండాఫ్ చూడాలిగా .. అన్నాడు. అంటే బావుంది అని ఒప్పుకోవడానికి కూడా మనసు ఒప్పదు. అప్పట్నుంచి థియేటర్‌లో సినిమా చూడాలంటేనే విరక్తి వచ్చేస్తోంది. అందుకే మారుమూల థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తాను.
థియేటర్‌లో చూసినప్పుడు షాక్ తిన్నా. ఎందుకంటే తొలి అర్థభాగం నెమ్మదిగా సాగుతుంది. ప్రేక్షకులు కథని రిసీవ్ చేసుకుంటారా? అని భయపడ్డా. సినిమా నడుస్తున్నంతసేపూ దృష్టి మరల్చకుండానే చూశారు. ఎక్కడ స్లో అయ్యిందనుకున్నానో అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్తి పత్రాలపై హీరో సంతకం చేస్తున్నప్పుడు, షేర్ ఆటోలో వెళ్లాల్సొచ్చినప్పుడు గొప్ప ఫీల్‌తో చూశారు. ఇవన్నీ థియేటర్‌లో నేను ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు.
కథ రాసుకున్నాక హీరో గురించి ఆలోచిస్తే అప్పడు అవసరం అయిన మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ కూడా హీరోని బట్టి మారుతుంది. నేను ముందు కథ రాసుకుంటా. తర్వాత హీరో గురించి ఆలోచించి మారుస్తుంటా. హీరోల కోసమూ కథలు రాయాలి. అయితే అందులో చెప్పాలనుకున్న విలువల్ని చెప్పి తీరాలి. నా ఒక్కడి సినిమానే బావుండాలని అనుకుంటా. కానీ బయట మాత్రం అందరి సినిమాలు బావుండాలని అనాలి (నవ్వుతూ).
సినిమా ఫలితం కంటే ఆ ప్రయాణమే ఎక్కువ కిక్ ఇస్తుంది. గెలుపోటములతో పనిలేదు. ఫ్లాపయితే ఏడుస్తూ కూచోలేం. హిట్టయితే గెంతులేయలేం. ఓ సీన్ పండింది అంటే ఆ కిక్కే వేరు.