కామెడీ ఎంటర్ టెయినర్లు తీయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తిరుగులేదు. ఆయన సినిమాల్లో యాక్షన్ పార్టు కన్నా కామెడీ సీన్సే ఎక్కువ హైలెట్ అవుతాయి. ప్రతి క్యారెక్టర్ నుంచి ఫన్ రాబట్టడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. యాక్షన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ త్రివిక్రమ్ చివరగా తెరకెక్కించిన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అవడమే కాదు.. డైరెక్టర్ గా సంపాదించుకున్న గుడ్ నేమ్ కు బీటలు పడేలా చేసింది.
డైరెక్టర్ తన సత్తా చాటాలన్న పట్టుదలతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడని లేటెస్ట్ టాక్. ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్ల మధ్య రగిలే పంతాలకు ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. సీనియర్ నటులు నాగబాబు - జగపతిబాబు ఈ ఫ్యాక్షన్ లీడర్ల పాత్రలు చేస్తున్నారు. సినిమా స్టారింగ్ లోనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ సినిమాకు కీలకంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బికినీ సోకులతో వెండితెరను హీటెక్కించిన బ్యూటీ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్లోకి ఇంకా పూజా అడుగుపెట్టలేదు. తరవాత షెడ్యూల్ నుంచి ఆమె జాయిన్ అవుతుంది. త్రివిక్రమ్ హోం బ్యానర్ అయిన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ లో కె.రాధాకృష్ణ ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇంతకుముందు బన్నీ హీరోగా తీసిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా కాస్త ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే మూవీయే.