మ‌హేష్ తో త్రివిక్ర‌మ్ రాజ‌కీయం?

Update: 2022-07-12 17:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ వేగాన్ని ఆపేదెవ‌రు?వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ప‌ట్టింద‌ల్లా బ్లాక్ బ‌స్ట‌ర్ బంగార‌మే అవుతుంది. 'భ‌ర‌త్ అనే నేను' తో మొద‌లైన విజ‌యాల ప‌రంప‌ర 'స‌ర్కారు వారి పాట' వ‌ర‌కూ కొన‌సాగుతూనే ఉంది.  వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసారు. తదుప‌రి సూప‌ర్ స్టార్ లైన‌ప్ చూస్తే అ విష‌యం అర్ధ‌మ‌వుతుంది.

'ఎస్ ఎంబీ 28 త్రివిక్ర‌మ్' తో..'29వ చిత్రం పాన్ ఇండియా మేక‌ర్ రాజ‌మౌళితో..'ఎస్ ఎస్ ఎంబీ 30' కూడా అదే రేంజ్ లో ఉంటుంది. 30వ సినిమా ల్యాండ్ మార్క్ కాబ‌ట్టి మ‌రింత ప్ర‌తిష్టాత‌క్మంగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్ప‌డు 28వ చిత్రం స్ర్కిప్ట్ విష‌యంలో  ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. హీరోలంతా పాన్ ఇండియా అంటూ దూసుకుపోతున్నారు.

మ‌నం అందుకు ఏమాత్రం త‌గ్గ‌క‌డ‌ద‌ని మాట‌ల మాంత్రికుడ్ని ముందుగానే హెచ్చ‌రించి స్ర్కిప్ట్ ని అదే రేంజ్ లో సిద్దం చేయించారని తాజా లీకుల్ని బ‌ట్టి  తెలుస్తోంది. 'ఎస్ ఎంబీ 28'వ చిత్రం క‌థ  నెక్స్ట్ లెవల్లో ఉంటుంద‌ని వినిపిస్తుంది. ప‌క్కా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్  స్టోరీ అని నెట్టింట బ‌ల‌మైన‌ ప్ర‌చారం ఒక‌టి తెర‌పైకి వ‌స్తుంది. మాంత్రికుడు ఏకంగా దేశ రాజ‌కీయాన్నే కుదిపేసే క‌థాంశంతో మ‌హేష్  తో ముందుకొస్తున్న‌ట్లు గుస‌గుస‌ వినిపిస్తుంది.

శంక‌ర్ 'ఒకే ఒక్క‌డు' రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా సందేశాత్మ‌క చిత్రంగా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తుంది. దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? అన్నది త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన థీమ్ గా చ‌ర్చించ బోతున్న‌ట్లు  ఫిలిం స‌ర్కిల్స్ లో సైతం హాట్ టాపిక్ గా మారింది. 'ఖ‌లేజా' సినిమాలో కార్పోరేట్ రాజ‌కీయాన్ని ట‌చ్ చేసిన  త్రివిక్ర‌మ్  పొగొట్టుకున్న చోటునే రాబ‌ట్టుకునే సంక‌ల్పంతో  నేప‌థ్యం మారినా అదే వేవ్ లో ముందుకొస్తున్నార‌ని  వినిపిస్తుంది.

భార‌త్ లోరాజ‌కీయం అనేది వ్యాపారంగా  ఎలా మారింది? అటుపై వృద్దిలో కి వ‌చ్చిన విధానం? మ‌ధ్య‌లో కార్పోరేట్ సిస్ట‌మ్ వెళ్లూనుకున్న  విధానం ఎలా ఉంది?  అన్న‌ది సినిమాలో  హైలైట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. క‌థ‌ని పూర్తిగా ఆద్యంతం సీరియ‌స్ మోడ్ లోని ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ న‌డిచేలా స్ర్కిప్ట్ లో జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది.

'ఖలేజా'లో దొర్లిన త‌ప్పిదాలు తాజా ప్రాజెక్ట్ లో ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌కుండా అన్ని రకాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ ప్రచారంలో వాస్త‌వం ఎంత అన్న‌ది యూనిట్ రివీల్ చేస్తే గాని క్లారిటీ రాదు. ఇప్ప‌టికే మ‌హేష్ 'భ‌ర‌త్ అనే నే ను' సినిమాతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని ట‌చ్ చేసిన సంగ‌తి  తెలిసిందే. ఇందులో  సీఎం పాత్ర‌నే పోషించి షాక్ ఇచ్చారు.
మ‌రి త్రివిక్ర‌మ్ పొలిటిక‌ల్ నేప‌థ్యంతో వ‌స్తే వ్య‌త్యాసం ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.
 
అటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కుతోన్న చిత్రం కూడా రాజ‌కీయ నేప‌థ్య‌మ‌ని తెలుస్తోంది. ఐపీఎస్ ట‌ర్న‌డ్ పొలిటీష‌న్ గా చ‌ర‌ణ్ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ సినిమా సైతం రాజ‌కీయ‌మే థీమ్ అయితే గ‌నుక ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.
Tags:    

Similar News