గురూజీ బాలీవుడ్ జంప్!

Update: 2020-02-19 04:41 GMT
ద‌ర్శ‌కులే నిర్మాత‌లుగా మారి సినిమాలు తీయ‌డం చూస్తున్న‌దే. మంచి క‌థ‌లు దొరికిన‌ప్పుడు వేరొక‌రిని నిర్మాత‌ను చేయ‌డం ఇష్టం లేక తామే నిర్మాత‌లైన ద‌ర్శ‌కులున్నారు. అయితే ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని ఇరుగు పొరుగు భాష‌ల్లో నిర్మించేందుకు మ‌న నిర్మాత‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఆ కోవ‌లోనే సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకు బాస్ అల్లు అరవింద్ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఆయ‌న‌తో పాటే హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ చేరారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రికీ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా జాయింట్ అయ్యార‌ట‌.

అల వైకుంఠ‌పుర‌ములో ద‌ర్శ‌కుడిగా ఆయ‌నకు హిందీ రైట్స్ ప‌రంగా షేర్ ఉంటుంది. ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాబ‌ట్టి అక్క‌డా మార్కెట్ ప‌రంగా ఈ సినిమా వ‌ర్క‌వుట‌య్యే ఛాన్సుంది. ఆ క్ర‌మంలోనే అల్లు అర‌వింద్ - రాధాకృష్ణ‌ల‌తో త్రివిక్ర‌మ్ కూడా వాటా కోరాడ‌ట‌. హిందీ వెర్ష‌న్ కి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా లేదా? అన్న‌ది అటుంచితే నిర్మాత‌గా కొన‌సాగుతార‌ట‌.

అయితే త్రివిక్ర‌మ్ కి నిర్మాత‌గా ఇదే తొలి సినిమా కాదు. ఇంత‌కు ముందు నితిన్ హీరోగా చ‌ల్ మోహ‌న‌రంగ చిత్రాన్ని స్నేహితుడు ప‌వ‌న్ తో క‌లిసి నిర్మించారు. ఆ సినిమాకి నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి కూడా ఒక నిర్మాత‌. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి బ్లాక్ బ‌స్ట‌ర్ అల‌.. చిత్రంతో హిందీ ప‌రిశ్ర‌మ‌కు త్రివిక్ర‌మ్ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నార‌న్న‌మాట‌. ఇక అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని ప‌ర్ఫెక్ట్ మ‌ల్టీస్టార‌ర్ గా తీర్చిదిద్దేందుకు స్క్రిప్టు ప‌ర‌మైన మార్పు చేర్పులు చేస్తున్నార‌ట‌. అక్క‌డ రీమేక్ కోసం స్టార్ల‌ను ఎంపిక చేయాలి. అలాగే హిందీ నేటివిటీకి త‌గ్గ‌ట్టు గా ఈ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కించేందుకు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News