త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే.. మిగతా అన్ని విషయాల కంటే డైలాగులే ఎక్కువగా గుర్తొస్తాయి. జనాలు తమ జీవితాల్లో కూడా ఉపయోగించుకోగల పంచ్ డైలాగ్స్ రాయడంలో త్రివిక్రమ్ కు తిరుగులేని గుర్తింపు ఉంది. అలాంటి ఓ దర్శకుడు.. రైటర్ ను అపాయింట్ చేసుకోవడం.. అది కూడా డైలాగ్స్ రాయడం కోసమే అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇది వాస్తవమే.
ప్రస్తుతం తాను ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కోసం పెంచల్ దాస్ అనే రైటర్ ను తీసుకున్నాడు త్రివిక్రమ్. రీసెంట్ గా వచ్చిన నాని మూవీ కృష్ణార్జున యుద్ధంలో 'దారి చూడు దుమ్ము చూడు మామ' అంటూ సాగే ఛార్ట్ బస్టర్ పాటను రాసిన రైటర్ ఇతనే. ఇప్పుడు మాటలు మాంత్రికుడు తీయబోయే సినిమాలో.. ఎన్టీఆర్ పూర్తిగా చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడతాడట. అందుకే ఈ సినిమా కోసం అక్కడి నేటివిటీ బాగా తెలిసిన వ్యక్తిని రైటర్ గా తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే పెంచల్ దాస్ ను తెచ్చుకున్నారట.
నిజానికి చిత్తూరు జిల్లా యాస త్రివిక్రమ్ కు కొట్టిన పిండే. అత్తారింటికి దారేది చిత్రంలో కోట శ్రీనివాసరావుకు.. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర అండ్ టీంకు చక్కని డైలాగ్స్ నే రాశాడు. కానీ ఈ సారి మాత్రం తాను పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి పెట్టాలని భావించి.. ఈ చిత్తూరు జిల్లా యాస డైలాగ్స్ కోసం పెంచల్ దాస్ ను తెచ్చుకున్నాడట త్రివిక్రమ్.