అన్న అరెస్ట్‌ తో చెల్లిపై ట్రోల్స్

Update: 2021-10-06 06:30 GMT
బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది కూడా డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్‌ అవ్వడంతో షారుఖ్‌ పరువు గంగపాలయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. షారుఖ్ ఇన్నాళ్లు సంపాదించుకున్న స్టార్ డమ్‌ తన కొడుకు చేసిన తప్పుతో అరెస్ట్‌ తో పోయిందంటూ మరి కొందరు అంటున్నారు. ఇదే సమయంలో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్ గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. హీరోయిన్ గా పరిచయం అవ్వాలనుకుంటున్న సుహానా కనీసం ఒక్క సినిమా కాని.. ఒక్క కమర్షియల్‌ కాని చేయకుండానే సోషల్‌ మీడియాలో రెండు మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ను దక్కించుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె లైఫ్‌ స్టైల్‌ మరియు డ్రస్సింగ్ స్టైల్‌ ఉంటుంది.

ఒక స్టార్‌ హీరో కూతురు అయ్యి ఉండి ఏంటీ ఈ డ్రస్ లు అంటూ అప్పుడప్పుడు ఆమెను ట్రోల్‌ చేసే వారు ఉన్నారు. ఆమె లైఫ్‌ స్టైల్‌ ను కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండు పదుల వయసుకే బాయ్ ఫ్రెండ్‌ కావాల్సి వచ్చాడా అంటూ కొందరు ఆమెను విమర్శిస్తే మరి కొందరు మాత్రం ఆమెను సమర్థించడం చాలా కామన్ గా జరుగుతోంది. గత రెండేళ్లుగా ఆమె గురించిన చర్చ రావడం కొందరు విమర్శించడం కొందరు సమర్థించడం చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో సుహానా చాలా లైట్ తీసుకుంటూ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లేది. ఆర్యన్‌ అరెస్ట్‌ తో ఆమె పై ట్రోల్స్ పది రెట్లు ఎక్కువ అయ్యాయి. అన్న కంటే రెట్టింపు యాక్టివ్‌ అయిన ఈ అమ్మాయి అతడిని మించి పనులు చేస్తుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్యన్‌ అరెస్ట్‌ అయిన ఈ సమయంలో తన కూతురు సుహానాపై ఖచ్చితంగా షారుఖ్‌ ఖాన్‌ దృష్టి పెట్టాలని.. ఆమె విషయంలో మళ్లీ తప్పు జరగకూడదని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి కొందరు సుహానాపై మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఆమె నిర్దోషిత్వంను ప్రశ్నిస్తున్నారు. తప్పు నువ్వు చేయలేదా అంటూ ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌ లకు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా కామెంట్స్ ఏంటో అంటూ షారుఖ్‌ ఖాన్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబం ఈ సమయంలో బాధలో ఉంది. వారిని ఓదార్చకున్నా పర్వాలేదు కాని మరింతగా వారి బాధను పెంచవద్దంటూ అభిమానులు మరియు కుటుంబ సన్నిహితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్యన్‌ కాని షారుఖ్‌ ఖాన్‌ కాని ఇప్పటి వరకు ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.
Tags:    

Similar News