'మహేష్ - నమ్రత' లవ్ మ్యారేజ్ కి ట్రబుల్ షూటర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
సూపర్ స్టార్ మహేష్ ముంబై బ్యూటీ నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. తొలుత స్నేహితులు అయ్యాక కాలక్రమంలో ప్రేమ చిగురించి పెళ్లి పీఠల వరకూ వెళ్లింది. అయితే ఈ పెళ్లి మహేష్ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. దీంతో మహేష్ తన సిస్టర్ మంజుల సహాయం తీసుకున్నారు. పెళ్లిలో కీలక పాత్ర దారి మంజుల. ఆమె స్వయంగా పూనుకుని ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసారు. ప్రస్తుతం మహేష్-నమ్రత జంట టాలీవుడ్ ఆదర్శ దంపతులుగా వెలిగిపోతున్నారు. వీళ్ల ప్రేమకు ప్రతి రూపం ఇద్దరు పిల్లలు గౌతమ్-సితార. మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ తాను పని చేసే విదేశీ లొకేషన్లకు ఫ్యామిలీ టప్రిప్ లను ప్లాన్ చేస్తుంటారు. ఇది కుటుంబ జీవనంలో ఒత్తిడిని తగ్గిస్తుందన్న సంగతి తెలిసినదే.
ప్రతిసారీ మహేష్ - నమ్రత తమ వారసులతో కలిసి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విదేశీ ప్లైట్ ఎక్కేస్తుంటారు. పెళ్లైయిన దగ్గర నుంచి మహేష్ ఇలా ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నమ్రత పెళ్లి తర్వాత భర్తే లోకంగా జీవిస్తున్నారు. సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయ్యారు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తోన్న సమయంలో మహేష్ కోసం ఆమె ప్రొఫెషనల్ కెరీర్ ని త్యాగం చేసారు. మహేష్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారన్నది అంతే వాస్తవం. ప్రతీ విషయంలోనూ మహేష్ సతీమణిని ఇన్వాల్వ్ చేస్తుంటారు. నమ్రత అంటే మహేష్ కు ఓ ధైర్యం.. ఎనలేని ప్రేమ..అప్యాయత..అనురాగం.
మరి ఈ జంట ఎలా కలిసారు? ముందుగా ఎవరు ప్రపోజ్ చేసారు? అంటే ఆసక్తికర సంగతి తెలిసింది. ఈ విషయాన్ని చాలాసార్లు టాలీవుడ్ మీడియా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినా మహేష్ ఎప్పటికప్పుడు స్కిప్ కొట్టేసేవారు. కానీ ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందిగా! అలా ఈరోజు అసలు విషయం లీక్ అయింది. ముందుగా మహేష్ కి నమ్రతనే డేర్ చేసి లవ్ ప్రపోజ్ చేశారుట. ఆ వెంటనే మహేష్ ఎలాంటి సమయం తీసుకోకుండా వెంటనే ఒకే చేసేసారుట. అంటే అప్పటికే మహేష్ మనసులో నమ్రత తిష్ట వేసారు. అయితే ఆ ఇద్దరినీ కలిపింది మాత్రం మంజుల అన్నది తెలిసింది తక్కువమందికే.
మంజుల ఇప్పుడేం చేస్తున్నారు?
షో సినిమాతో మంజుల నటిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించారు. ఇటీవల దర్శకురాలిగానూ మారారు. ఇక నిర్మాతగా సినిమాలు తీస్తున్న మంజుల సొంత యూట్యూబ్ చానెల్ ని రన్ చేస్తున్నారు. ఇటీవలే ఓ చిత్రంలో నటిస్తూ బిజీ అయ్యారు. సుమంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు సినిమా `మళ్లీ మొదలైంది`లో డాక్టర్ మిత్ర అనే థెరపిస్ట్ పాత్రలో మంజుల నటిస్తున్నారు. ఇటీవల మంజుల లుక్ ని సోషల్ మీడియాలో విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని మంజుల స్వయంగా తెలిపారు. విడాకుల అనంతరం పునర్వివాహం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.